29.7 C
Hyderabad
April 18, 2024 03: 01 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ప్రాజెక్టు పెట్టు రుణాలు కొట్టు

pjimage (7)

పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం వద్ద నుంచి భూములు, బాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు పొంది కంపెనీల నుంచి ఉత్పత్తిని సాధించకపోగా, బాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సొంత ఆస్తులను కూడ పెట్టుకుంటున్న బడా పారిశ్రామికవేత్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. చివరికి తీసుకున్న రుణాలను తీర్చకపోగా అవి వడ్డీలతో సహా కోట్ల రూపాయల అప్పులకు చేరి చివరికి పరిష్కారం కోసం నేషనల్ కంపెనీ లా బోర్డు కు చేరుతున్నాయి.

దీనివల్ల రుణాలకు గ్యారెంటీ పెట్టిన ఇతర కంపెనీలు మునిగి ఉద్యోగులు నట్టెటమునుగుతుండగా, యజమానులు మాత్రం ఏమాత్రం నష్ట పోకుండా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ కంపెనీ మునుగుతోందని తెలిసికూడా కొత్త కంపెనీల కోసం వందలాది ఎకరాల భూమి కావాలని దరకాస్తు చేసి అర్ధ బలం రాజకీయ బలం ఉపయోగించి తిరిగి భూములను పొందటానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రభుత్వాధినేతల అండదండలు పుష్కలం గా అందుతున్నాయి. ప్రస్తుతం ఇదే కోవలోనికి కోనసీమ గ్యాస్ పవర్ కంపెనీ వచ్చింది.

ప్రస్తుతం అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో హాట్ టాపిక్ గా మారిన సినీనటుడు, తెలుగుదేశంనేత బాలకృష్ణ వియ్యకుండు ఎఎస్పీ రామారావు కు చెందిన కోనసీమ గ్యాస్ కంపెనీ ప్రస్తుతం ఆర్ధిక వివాదాలలో చిక్కుకొని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు నిలబడింది. రాజకీయం గా బాగా పలుకుబడి కలిగిన ఈయనకు కోనసీమ గ్యాస్ పవర్ కంపెనీ ప్రారంభించే నాటికి తండ్రి విశాఖ పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతుండగా, మామ కాంగ్రెస్ పార్టీ లో అనేక పదవులు చేపట్టి ప్రముఖ పారిశ్రామిక వేత్త గా ఉండేవారు.

అయితే అమరావతి సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన కంపెనీ స్థాపనకు ప్రయత్నించే ముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉండే వారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పరిశ్రమలను స్థాపించటం తప్పుకాదు కానీ, ప్రారంభించే కంపెనీల ఉత్పత్తి ప్రారంభించిన కొద్దీ రోజులకే అవి మూత పడటం, నడపటం సాధ్యం కాదని తెలిసినా బాంకులనుంచి రుణాలు పొందటం,వాటి తో ఆస్తులు కూడ బెట్టుకోవటం, కంపెనీలలో పనిచేసే సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం,నష్టాలు పేరుతొ కార్మక చట్టం ద్వారా ఉద్యోగులకు దక్కాల్సిని సదుపాయాలనుదక్కకుండా చేయటం పరిపాటి గా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.

గ్యాస్ ఆధారిత విద్యుత్ నుంచి చౌక ధరకు విద్యుత్ ను సరఫరా చేస్తామని  1997 వ సంవత్సరంలో కోనసీమ ఈపీఎస్ ఒకేవెల్ కంపెనీ ప్రభుత్వానికి దరకాస్తు చేసింది. కాలక్రమేణా ఇది కోనసీమ గ్యాస్ పవర్ కార్పొరేషన్ గా మారి పోయింది. ఈ కంపెనీ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తామని కంపెనీ యాజమాన్యం దరకాస్తు లో పేర్కొంది. ఈ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణమండలి అనుమతి రాకముందే ఈ కంపెనీ కి అవసరమైన గ్యాస్ సరఫరా చేస్తామని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనుమతిని ఇవ్వటం వివాదాస్పదం అయింది.

ఈ నేపథ్యంలో ఆంద్ర ప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవటంలో చాలా జాప్యం జరిగింది. 1998 వ సంవత్సరంలో కేంద్రంలో  భారతీయ జనతా పార్టీ  అన్యుహంగా అధికారంలోనికి రావటం, లోక్ సభ స్పీకర్ గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలయోగి స్పీకర్ గా ఎన్నిక కావటం తో ఈ ప్రాజక్టు నిర్వాహకులలో ధీమా పెరిగింది. అదే సమయంలో 1999 వ సంవత్సరంలో జరిగిన  ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా, కేంద్రంలో వాజపేయి ప్రభుత్వానికి బైటనుంచి మద్దత్తు ఇవ్వటం,స్పీకర్గా తిరిగి బాలయోగి ఎన్నిక కావటం తో ఈ ప్రాజక్టు అనుమతులకోసం నిర్వాహకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ సమయంలో అనుమతులకు తీవ్ర జాప్యం జరగటంతో ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావటంతో పీపీఏ పూర్తి అవటం దాని తరువాత విద్యుత్ నియంత్రణమండలి అనుమతి కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ నిల్వలు లేవని, ప్రభుత్వానికి స్థిర చార్జీల రూపంలో గుదిబండ అవుతుందని ఇది మరో దభోల్ ప్రోజక్ట్ అవుతుందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగేయి. అదేవిధంగా 2003 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి శాసన సభలో అప్పటి ప్రతిపక్షం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పట్లో బిగ్ బాస్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. దీనితరువాత రాజశేఖరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అవటం స్థిర చార్జీలు ఇవ్వటం ప్రభుత్వానికి భారం అవుతుందని నాలుగు గ్యాస్ పవర్ కంపెనీలకు స్పష్టం చేయంతో ఈ కంపెనీలు దిగిరాక తప్పలేదు.

కరెంటును ఉత్పత్తి చేసినా, చేయక పోయిన ప్రభుత్వం స్థిర చార్జీలు చెల్లిస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో అడ్డగోలుగా చేసుకున్న ఒప్పందం  తీవ్ర వివాదాస్పదం అయింది. ఈ ప్రాజక్టు వల్ల ఈ కంపెనీ మాతృ సంస్థలు నష్ట పోయాయి.ఈ కంపినికి మూల ధనం సమకూర్చిన మాతృ సంస్థ విబిసి ఫెర్రో అల్లాయిస్ కంపెనీ కూడా మూత  పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కర్మాగారంలో పనిచేసే సుమారు 500 కుటుంబాలు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది.ఇప్పటికి కొంతమంది ఉద్యోగులకు కార్మక చట్టంద్వారా రావాల్సిన సదుపాయాలూ అందలేదు.సుమర్రు 200 ఎకరాలు విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కంపెనీ లో అధిక శాతం ప్రైవేట్ భూములే.సుమారు 38 ఎకరాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ కు చెందినివి.వేలం పాత ద్వారా ఈ భూములును ధర చెల్లించి పొందారు. ఈ బూములన్నిటిని బాంకులవద్ద తనఖా పెట్టి సుమారు వివిధ ఆర్ధిక సంస్థలనుంచి సుమారు 1500 కోట్ల రూపాయలు రుణాలు పొందారు. అయితే యాజమాన్యం మాత్రం ఈ నిధులతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద 500 ఎకరాలు స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఈ అంశం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్  వద్ద విచారణల్లో ఉంది. భూములన్నీ ఆర్ధిక సంస్థల వద్ద తనఖా ఉండటంతో వాటికి నష్టం లేదని, యాజమాన్యంపై అసలే నష్టం లేదని చివరికి రైతులు,ఉద్యోగులు కార్మికులు నష్ట పోయారని పలువురు విమర్శిస్తున్నారు. గ్యాస్ అందుబాటు ఉండడదని,స్థిర చార్జీలు ప్రజలపై పెనుభారం అవుతుందని  తెలిసినా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉదారంగా అనుమతులు మంజూరు చేసేసారు. వీటిఅన్నిటిని దృష్టిలో ఉంచుకొనే ప్రస్తుత ప్రతిపక్ష నేత పీపీఏల ్పున సమీక్ష వద్దు అంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

ఒక ప్రాజక్టు నిండా నీటిలో మునుగుతున్న ఈంకో ప్రాజెక్టు కోసం ప్రయత్నించి ప్రభత్వ భూములు,ఆర్ధిక సంస్థలనుంచి రుణాలు పొంద టానికి ప్రయత్నం చేయటం,వాటికి రాజకీయ నాయుకులు అండగా ఉండటం చాలా విడ్డురం. తిరిగి క్రీడ్ పోకో అంటే తెలియకుండా మాట్లాడుతున్నారనిఎదురుదాడి చేయటం విశేషం.

ramakrishna-mutnuru-1
ముట్నూరు రామకృష్ణ                                                               

                                                        

Related posts

నీలాచలం కొండ వద్ద స్పృహ తప్పిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

Satyam NEWS

దళారులకు అమ్ముకున్న వరి రైతులను కూడా ఆదుకోవాలి

Satyam NEWS

నెల్లూరు చాయ్ బ్రాండ్ సికందర్

Satyam NEWS

Leave a Comment