30.7 C
Hyderabad
April 29, 2024 05: 46 AM
Slider ఖమ్మం

భ్రూణ హత్యలు నేరం

#judge

వరకట్న అగ్గితో ఆడవారిని దహించవద్దని, భ్రూణ హత్యలు ఒక నేరం అని, అలా చేయవద్దని ఖమ్మం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి డా. టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లు అన్నారు.  కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో వరకట్నం, భ్రూణ హత్యలపై రూపొందించిన బ్యానర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొరుగు వారి నుండి ఏదీ ఆశించవద్దని, అది దహించివేస్తుందని అన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని  తెలిపారు. శిశువును గర్భంలోనే తుంచవద్దని, ప్రపంచాన్ని చూడనివ్వాలని, భ్రూణ హత్యలు ఆపాలని, ఆడపిల్లలను కాపాడాలని  అన్నారు. ప్రజల్లో అవగాహన కలిగి, చైతన్యం కొరకు బ్యానర్లను కలెక్టరేట్, జిల్లా కార్యాలయాల్లో ప్రదర్శించాలని వారు తెలిపారు.   ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంతరాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం

Bhavani

నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా రిక్షా కార్మికుల రేట్లు పెంచాలి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment