26.7 C
Hyderabad
May 3, 2024 09: 39 AM
Slider విజయనగరం

నేర సమీక్షా సమావేశం.. గతేడాది కన్న భిన్నంగా నిర్వహణ..!

#Vijayanagaram police

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ గత ఏడాది మాదిరిగానే నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ ఏడాది గతేడాది కన్న భిన్నంగా… ఈ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదీ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఏ సర్కిల్ పరిధి సిబ్బంది ఆ సర్కిల్ వారీగా నేర సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై జరిగే అఘాయిత్యాలు, దాడులను తీవ్రంగా పరిగణించి, ఆయా కేసుల్లో దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మైనరు బాలికల పై జరిగే అఘాయిత్యాలపై పోక్సో చట్టం క్రింద నమోదైన కేసుల్లో విధి విధానాలను పాటించాలని, నిందితులను తక్షణమే అరెస్టు చేయడంతోపాటు వారిపై తప్పనిసరిగా రౌడీ షీట్లును తెరవాలన్నారు.

దిశ చట్టం గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడం, దిశ ఎ ఓపి యాప్ ను ప్రతీ మహిళ తన స్మార్ట్ మొబైల్స్ లో డౌన్ లోడు చేసుకొనే విధంగా చూడాలని, వీటికి ఎంఎస్ పీలు, మహిళా మిత్ర, మహిళా రక్షక్ సభ్యులు సేవలను వినియోగించుకోవాలన్నారు.

మహిళా కానిస్టేబుళ్ళను, కానిస్టేబుళ్ళను, హెచ్ సి లను మహిళా మిత్రలకు కో-ఆర్డినేటర్లుగా నియమించాలన్నారు.

పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో, వార్డులలో మహిళలకు, విద్యార్థినులకు దిశ మొబైల్ యాప్ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసి, తాము ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు ఎస్. ఓ.ఎస్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పోలీసులకు సమాచారం అందిచడం గురించి అవగాహన కల్పించాలన్నారు.

ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోను నిర్జన ప్రదేశాలను, గతంలో అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రదేశాలను, నేరాలు జరిగేందుకు ఆస్కారమున్న ప్రదేశాలలో గుర్తించి, మ్యాపింగు చేసి, వీటిని కవర్ చేస్తూ ప్రత్యేక బీట్ల్ ఏర్పాటు చేసి, పెట్రోలింగు నిర్వహించాలన్నారు.

నాటుసారా, బెల్టుషాపులపై కఠిన వైఖరితో వ్యవహరించి, నేరాలను నియంత్రించాలన్నారు. ఇందుకోసం, గ్రామ స్థాయిలో సారా విక్రయాలు, అనధికారంగా బెల్టు షాపులతో మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

సారా, మద్యం విక్రయించే వారిని గుర్తించి, బైండోవర్ చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుల్లోని అంశాలకు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత చట్టం, సెక్షనులను పొందుపర్చాలన్నారు.

దర్యాప్తులో ఉన్న తీవ్రమైన నేరాల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులు శిక్షింపబడే విధంగా సాక్ష్యాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపి, నివేదికలను త్వరితగతిన పొందాలని, అభియోగ పత్రాలను నిర్దిష్ట సమయాల్లో దాఖలు చేయాలన్నారు. పెండింగులో ఉన్న పోలీసు కార్యాలయ రిఫరెన్సుల్లో విచారణ పూర్తి చేసి, త్వరితగతిన నివేదికలను పంపాలన్నారు.

మిస్సింగ్ కేసుల పై ప్రత్యే దృష్టి పెట్టి, వారి ఆచూకీ కని పెట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

అదే విధంగా మిస్సింగు వ్యక్తుల ఆచూకీ కనిపెట్టేందుకు ఎంఎస్ పీల వద్ద సమాచారం ఉండే విధంగా చూడాలన్నారు.

పట్టణాలలో, గ్రామాలలో కరోనా నియంత్రణ చర్యల గురించి ప్రజలలో అవగాహ కల్పించాలన్నారు. అనంతరం, గత నెల లో నమోదైన కేసులను, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తును పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు దర్యాప్తులను పూర్తి చేసేందుకు జిల్లా ఎస్పీ రాజకుమారి దిశానిర్దేశం చేసారు.

ఈ సమీ క్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్. ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డిపిఓ ఎఓ వెంకట రమణ, న్యాయ సలహాదారులు పరశురాం,

సీఐలు బి.వెంకటరావు, ఎస్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్, డి. జె. మురళి, సిహెచ్. శ్రీనివాసరావు, టీఎస్ మంగవేణి, శ్రీధర్, జి.సంజీవరావు, ఎస్.సింహాద్రినాయుడు, శోభన్ బాబు, సిహెచ్. లక్ష్మణరావు, విజయానంద్, ఈ నర్సింహమూర్తి ఎల్. అప్పలనాయుడు, టీవి తిరుపతిరావు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు జూమ్ వీడియో కాన్స్ రెన్స్ లో పాల్గొన్నారు.

Related posts

పాపకు పట్టీలు కొనేందుకు వెళ్లి.. మృత్యువడిలోకి…

Satyam NEWS

బాబు తో రాయచోటి టీడీపీ నేత రాంప్రసాద్ రెడ్డి భేటీ

Satyam NEWS

విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయింది

Satyam NEWS

Leave a Comment