27.7 C
Hyderabad
May 4, 2024 10: 12 AM
Slider గుంటూరు

‘సాటిలేని సహకారం’ పై చర్చకు సిద్ధం

#potulabalakotaiah

‘సాటిలేని సహకారం’ అంటూ ప్రభుత్వ పత్రికలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చు పై అబద్ధాలు ప్రచారం చేయడంపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ ఆమలు పై కేంద్ర గణాంకాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్ర స్థానంలో ఉందంటూ, 22 రాష్ట్రాలలో 29.84 లక్షల ఎస్సీ కుటుంబాలకు మేలు జరిగితే, ఒక్క ఏపీలోనే 29.10 లక్షల కుటుంబాలకు సబ్ ప్లాన్ నిధులతో మేలు చేసినట్లుగా అబద్ధాలు రాశారని తెలిపారు.

ఎస్సీ కాలనీలలో రహదారుల కోసం, డ్రైనేజీ పనుల కోసం, త్రాగునీటి సౌకర్యాల కోసం కేటాయించే సబ్ ప్లాన్ నిధులను మూడేళ్లుగా పూర్తిగా దారి మళ్ళించి, నవరత్నాల ద్వారా ఇచ్చే ఉమ్మడి లబ్ధిని ఎస్సీ లకు చేసినట్లు ప్రచారం చేసుకోవడం దళితులను మోసం చేయటమే అని పేర్కొన్నారు. మూడున్నరేళ్ళలో ఎస్సీ కాలనీలలో ఎన్ని మీటర్ల రోడ్లు వేశారో, ఎన్ని డ్రైనేజీ పనులు చేశారో, త్రాగునీటి పథకాలు ఎన్ని చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

దశాబ్దాలుగా అమలులో ఉన్న 27 రకాల సంక్షేమ పథకాలను నిలిపివేసి, సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించిన అంశాలను న్యాయస్థానాలు సైతం ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఎస్సీ ,ఎస్టీ ల కొరకు మాత్రమే ఖర్చు చేయాల్సిన డబ్బులను, ఆఖరికి కేంద్ర ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఇచ్చిన రూ.900 కోట్లు త్రాగునీటి నిధులను కూడా నవరత్నాలకు జమ చేశారన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై దమ్ముంటే ఐదుగురు ఎస్సీ మంత్రులు కానీ, 27 మంది ఎస్సీ వైకాపా ఎమ్మెల్యే లు కానీ బహిరంగ చర్చకు రావాలని, అందుకు తాను సిద్ధం అని డిమాండ్ చేశారు. అబద్దాలతో కాలయాపన చేయటం ఇప్పటికైనా మానుకోవాలని, నిజాలు ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయన్న విషయాన్నైనా గ్రహించాలని బాలకోటయ్య హితవు పలికారు.

Related posts

Protest: తెలుగు అకాడమీని నీరుగార్చవద్దు

Satyam NEWS

అన్నా నీ త్యాగం ముందు కరోనా ఓడాలి

Satyam NEWS

రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

Satyam NEWS

Leave a Comment