39.2 C
Hyderabad
May 4, 2024 21: 56 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో జనసేన జెండా ఎగరాలి

#Jana Sena flag

రాజకీయంగా వెనుకబాటకు గురైన సమాజాన్ని చైతన్యపరిచి రాజాధికారం వైపు నడపడమే పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యం. ఆ దిశగానే కొల్లాపూర్ నియోజకవర్గ బరిలో ఉండబోతుంది అని కొల్లాపూర్ నియోజక వర్గం జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు అన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల సమస్యల పైన దృష్టి సారించి గడపగడపకి జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని కొల్లాపూర్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి గడపగడపకి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు పని చేయాలని ఆయన కోరారు.

ఆ దిశగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వచిస్తూ ముందుకు సాగాలని భైరపోగు సాంబశివుడు పిలుపునిచ్చారు. అలాగే జనసేన పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రతి ఒక్క అభిమాని జనసైనికుడు ప్రతి గడపకి తిరగాలని ఆ దిశగా పనిచేస్తూ ముందుకు సాగే విధంగా కార్యక్రమం రూపొందించుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగిరే విధంగా ముందుకెళ్లాలని కోరారు.

ఈ ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలను అన్యాయాలను దాడులను వ్యతిరేకిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ మహనీయులు మార్గాన్ని చూపుతూ అధికార దిశగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని అన్నారు. ఈ సందర్భంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అవసరమెంతైనా ఉంది అని ప్రజలకి పార్టీని దగ్గర చేయడమే మన అంతిమ లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కొల్లాపూర్ నియోజక వర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలమైన శక్తిగా బలమైన ప్రభావం చూపబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కేవలం రాజకీయంగా వెనుకబాటుకు గురైన సమాజానికి ప్రజలను ఏకం చేస్తూ రాజకీయాల వైపు రాజ్యాధికారం దిశగా నడిపించడం కోసమే ఆయన జనసేన పార్టీని స్థాపించి ఆ దిశగా అహర్నిశలు కష్టపడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నారు.

పవన్ కళ్యాణ్ ఎంతో నిజాయితీ గల నాయకుడు అని అలాంటి నాయకుడు ఈ దేశానికి ఈ రాష్ట్రాలకి ఎంతో అవసరమని అన్నారు. అలాంటి నాయకుడిని కాపాడుకొని అలాంటి పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ యువకులకు ఒక స్థానిక పౌరులుగా నియోజకవర్గ నాయకులుగా కార్యకర్తలుగా జనసైనికులుగా మన బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల నాయకులు తల్లారి మల్లేష్’ బత్తిని బాలు’ రాఘవేందర్’ సుల్తాన్ గిరి ప్రసాద్’ విజయ్ కుమార్’ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల్లో ఈవీఎంలు రద్దుకు బిల్లు తీసుకురావాలి

Satyam NEWS

ఆశ లావు పీక సన్నం: విఫలమైన ‘జాతీయ స్వప్నం’

Bhavani

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి

Satyam NEWS

Leave a Comment