41.2 C
Hyderabad
May 4, 2024 18: 41 PM
Slider హైదరాబాద్

కరోనా సోకిన జర్నలిస్టులకు కోటి సాయం

#AllamNarayana

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జర్నలిస్టుల సంక్షేమ నిధికి కేటాయించిన 100 కోట్ల గ్రాంటు ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులకు రక్షణ కవచంలా తయారయ్యింది. ఆ వంద కోట్ల నిధుల నుండి 34.50 కోట్ల రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయి. 

ఆ నిధి ద్వారా వచ్చిన వడ్డీతో  కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఒక కోటి 4 లక్షల 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దీనితోపాటు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, దీర్ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు 5 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆదుకోవడం కోసం మీడియా అకాడమి మే-2020 నుండి కరోనా పాజిటీవ్ వచ్చిన 479 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున, 95 లక్షల 80 వేలు, దీనితోపాటు ప్రైమరీ కాంటాక్ట్ చేత హోంక్వారంటైన్లో ఉన్న 84 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, 8 లక్షల 60 వేలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు.

మొత్తంగా సంక్షేమ నిధి నుండి జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఒక కోటి 4 లక్షల 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. దీనితోపాటు లాక్ డౌన్ సమయంలో దాదాపు పన్నెండు వందల మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, సానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశామని ఆయన తెలిపారు.

Related posts

పొలం బాట పట్టి వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య ఉప కేంద్ర సిబ్బంది

Satyam NEWS

వృద్ధులకు దుప్పట్లు పంచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

అంబర్ పేట్ నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

Satyam NEWS

Leave a Comment