32.7 C
Hyderabad
April 27, 2024 00: 44 AM
Slider నల్గొండ

పొలం బాట పట్టి వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య ఉప కేంద్ర సిబ్బంది

#coronavaccine

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఆరోగ్య ఉప కేంద్ర వైద్య సిబ్బంది ఇంటింటికీ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా హుజూర్ నగర్ లోని వ్యవసాయ కూలీలకు వ్యాక్సిన్ అందించేందుకు పొలంబాట పట్టారు. 

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ వ్యవసాయ పనుల రోజులు కావడంతో తమ ప్రాంత పరిధి లోని వ్యవసాయ కూలీలు పొలాలకు  వెళ్లడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వ్యాక్సిన్ యెక్క ఆవశ్యకతను వివరించి టీకాలు అందించామని తెలిపారు.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం, శానిటైజర్,సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ, యరగాని హైమ, ఆశ కార్యకర్త సావిత్రి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎన్నికల వేళ ఇంటింటికీ ఇస్తానన్న బియ్యం ఏది?

Satyam NEWS

సంస్కృతి వారసత్వం

Satyam NEWS

రామ భక్తుల పరువు తీసిన నారాయణుడు

Satyam NEWS

Leave a Comment