29.2 C
Hyderabad
November 8, 2024 13: 38 PM
Slider ప్రపంచం

అబ్జెక్షన్:ప్రిన్స్‌ హ్యారీ మేఘన్‌ల ఖర్చు మా కొద్దు

prince harry meghan security budjet not payable

ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెన్‌ దంపతులు కెనడాకు వచ్చి మకాం పెట్టినప్పటి నుంచి వారి భద్రతకయ్యే ఖర్చును ఎవరి భరిస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఖర్చులను కెనడా ప్రభుత్వం భరిస్తుందని వార్తలు తొలుత వెలువడగా, అందుకు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా సొమ్మును వృధా చేస్తారంటూ పలు వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

బ్రిటీష్‌ రాజ కుటుంబానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి బ్రిటీష్‌ కొలంబియా ప్రాంతంలోని కెనడాలో ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి అందులో ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెన్‌ దంపతులు తమ కుమారుడితో సహా నివసిస్తున్న విషయం తెల్సిందే. బ్రిటీష్‌ రాజ కుటుంబంతో ఎలాంటి తెగతెంపులు చేసుకోకుండా వారంతట వారొచ్చి తమ దేశంలో ఉన్నట్లయితే వారి భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు అభ్యంతరం లేదన్నారు. అసలు రాజకుటుంబం వారసులుగా వారు కెనడాలో ఉన్నట్లయితే రాజ కుటుంబమే ఆ ఖర్చులను భరించేది.

ఏదేమైనా హ్యారీ దంపతుల భద్రతకు ఏటా మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం తో మాకు సంబంధం లేదని కెనడా ప్రభుత్వం అంటే మాకు కూడా సంబంధం లేదని బ్రిటీష్‌ రాజ కుటుంబం పేర్కొనడం తో ఆ దంపతులు ఈ ఖర్చులు ఎలా భరిస్తారో అనే సంశయం వెలువడుతుంది.

Related posts

మునిసిపల్ ఎన్నికల బీ ఫారాలు అందుకున్న బీరం

Satyam NEWS

తెలంగాణ  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి విజయనగరం పోలీసుల టెలి-స్పందన

Satyam NEWS

Leave a Comment