27.7 C
Hyderabad
May 4, 2024 08: 24 AM
Slider మహబూబ్ నగర్

స్కానింగుల పేరుతో ఆస్పత్రుల్లో దోపిడీ

#scanningcenter

వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపరచాలని,  ప్రైవేట్ హాస్పిటల్ ల లో ఉన్న దోపిడిని అరికట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కోరారు. స్కానింగుల పేరుతో ఆస్పత్రుల్లో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. 

జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల అనుమతులు పరిశీలించి చట్టబద్ధంగా లేని ఆసుపత్రిలను రద్దు చేయాలని, వనపర్తి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. ఐక్యవేదిక నాయకులు  చిరంజీవి, వెంకటేష్, రమేష్,శివ యాదవ్, గుమ్మడం రాజు, పెద్దగూడెం రమేష్ తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పటి అనుమతులను జిల్లా ఏర్పడిన తరువాత కూడా మార్చకపోవడంతో  వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు వాటికి అనుగుణంగానే పనిచేస్తున్నాయని, సీజనల్ వ్యాధులతో వచ్చిన రోగులకు, ఇతర స్కానింగ్లో పేరుతో దోపిడీ చేస్తున్నారని, చిన్న పిల్లల డాక్టర్ అయితే వారి సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారని చెప్పారు.

 ఎవరో కొందరు డాక్టర్లు,కొన్ని హాస్పిటల్లో తప్ప  మిగతా హాస్పిటల్ చాలావరకు  హాస్పిటల్  లు నిబంధనలకు విరుద్ధంగానే పని చేస్తున్నాయని, అలాగే పాలీ క్లినిక్ ల పేరిట వెలసిన స్కానింగ్,టెస్ట్ ల సెంటర్ లకు పంపి పేద ప్రజలను దోపిడీ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని విమర్శించారు. అన్ని ఆసుపత్రుల్లో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా చూసి,ఒక నివేదిక తయారు చేసి డీఎంహెచ్వో కు, కలెక్టర్ కు, తెలంగాణ రాష్ట్ర విద్య అధికారికి, మంత్రి నిరంజన్ రెడ్డికి, సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఇస్తామని ఐక్యవేదిక సభ్యులు తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అబ్సర్వర్

Bhavani

సోషల్ మీడియా వేదికగా బీజేపీ దుష్ప్రచారం

Satyam NEWS

రష్యాపై పిడుగు: వీసా మాస్టర్ కార్డు కార్యకలాపాల ఉపసంహరణ

Satyam NEWS

Leave a Comment