38.2 C
Hyderabad
May 1, 2024 22: 56 PM
Slider ఖమ్మం

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అబ్సర్వర్

#polling stations

ఖమ్మం జిల్లా ఎలక్టోరోల్ రోల్ అబ్జర్వర్, చీఫ్ రేషనింగ్ అధికారిణి, హైదరాబాద్ బి. బాల మాయాదేవి ఖమ్మం జిల్లాలో పర్యటించి, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి కార్యాలయం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కొనిజర్ల మండలం తనికెళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వైరా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాల బూత్ లెవల్ అధికారులతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు చేపడుతున్న చర్యల గురించి అడిగారు.

బూత్ లెవల్ అధికారికి ఎన్ని ఫారం-6, 7, 8 లు వచ్చినవి, ఎన్ని తనిఖీలు చేసి వారి స్థాయిలో పరిష్కరించింది అడిగి తెలుసుకున్నారు. డెత్ ఓటర్లను ఎలా తొలగిస్తున్నది అడుగగా, పంచాయతీ కార్యదర్శుల నుండి మరణ ధ్రువీకరణ పత్రాలు పొంది, ధృవీకరించుకున్న తర్వాత తొలగింపుపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

18 నుండి 19 సంవత్సరాలు, 19 నుండి 21 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు పైబడినవారు ఎన్ని దరఖాస్తులు వచ్చింది అడిగి తెలుసుకున్నారు. 30 సంవత్సరాలకు పైబడినవారు దరఖాస్తు చేసుకుంటే, జాబితాలో పెరు ఉన్నది లేనిది ఆన్లైన్లో తనిఖీ చేయాలని, మరొకచోట పేరు ఉంటే, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేయించాలని పరిశీలకులు తెలిపారు. కొత్త కోడళ్లు వచ్చిన చోట, వారి తల్లిదండ్రులు గ్రామాల్లో ఓటు ఉన్నది లేనిది తనిఖీ చేయాలని, అక్కడ లేకుంటే ఫారం-6, ఒకవేళ అక్కడ ఓటు ఉంటే, ఫారం-8 ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని ఆమె అన్నారు.

ఓటు హక్కు ఎంతో ఉన్నతమైనదని, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటుహక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని ఎలక్టోరోల్ రోల్ పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు, బిఎల్ఓ లు తదితరులు ఉన

Related posts

అభివృద్ధి పనుల్లో నాణ్యత కలిగిన ప్రమాణాల పట్టించాలి

Satyam NEWS

ఈ ఆఫీస్ అప్లికేషన్ ద్వారా నే ఇక పోలీసు సేవలు

Satyam NEWS

రాఖీ పార్సిల్ కోసం ఆదిలాబాద్ డిపో ప్రత్యేక స్కీమ్

Satyam NEWS

Leave a Comment