26.7 C
Hyderabad
May 3, 2024 07: 41 AM
Slider నల్గొండ

అఖిలపక్ష పోరాటంతో  డబల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య ఉన్న చెత్త తొలగింపు

#doublebeadroom

హుజూర్ నగర్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య ఉన్న చెత్తను తొలగించి వెంటనే అర్హులైన పేద వారికి పంచాలనే డిమాండ్ తో 28వ,తేదీన అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఇళ్లను 80 శాతం పనులు పూర్తి చేశారు.

అప్పటి మంత్రి, ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో అప్పటిలో ఈ నిర్మాణాలు చేశారు. హుజుర్ నగర్ లో జరుగుతున్న విషయం రాష్ట్ర మంత్రి వర్గానికి కి తెలిసి రాష్ట్ర మంత్రుల పర్యటన వాయిదా పడటంతో స్థానిక తెరాస నాయకులు తప్పనిసరి పరిస్థితిలో గృహల మధ్యలో ఉన్నా చేత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు.

ఈ పనులను అఖిల పక్ష నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు, యరగాని నాగన్న గౌడ్,తన్నీరు మల్లికార్జున్,ఎలక ఎంకటేశ్వర్లు,అలీ, కౌన్సిలర్లు,నాయకులు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శ్రీ ఫణిగిరి సీతారామచంద్రస్వామి (రామస్వామి)గట్టు వద్ద 200 కోట్ల తో నిర్మాణం చేపట్టిన ఇండ్లను పాడుపెట్టారని అన్నారు. ఇళ్ల మధ్య మున్సిపాలిటీ వారు చెత్త,చెదారం వేసి పేద ప్రజలకు పంచ వలసిన గృహాలను  డంపింగ్ యార్డుగా మార్చి గత పాలకులకు పేరు రాకుండా ఉండేలా చేశారని అన్నారు.

పలుమార్లు ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్,మంత్రి జగదీష్ రెడ్డి ఆ ఇండ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తాం అని హామీ ఇచ్చి ఆ హామీలను విస్మరించారని అన్నారు. ఇండ్ల మధ్య పోసిన చెత్తను తొలగించి ఇండ్లను పూర్తి చేసి పేదలకు పంచాలని పలుమార్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు పలుమార్లు డంపింగ్ యార్డును పరిశీలన చేశారని అన్నారు.

స్థానిక అధికార తెరాస ప్రజా ప్రతినిధులు ఆగిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే  పూర్తిచేసి అఖిల పక్షం ద్వారా కమిటీ వేసి అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ళు అందజేయాలని,లేనిచో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పేద ప్రజల తరఫున ప్రజా ఉద్యమం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకురాలు,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,జక్కుల మల్లయ్య,ఎడవల్లి వీరబాబు,గొట్టిముక్కుల రాములు, ముషం సత్యనారాయణ, కారంగుల వెంకటేశ్వర్లు,కంకణాల పుల్లయ్య, బెల్లంకొండ గురవయ్య,మేళ్లచెరువు   ముక్కంటి,పులిచింతల అంజిరెడ్డి, కస్తాల రవీందర్,దొంతగాని జగన్,చింతకాయల రాము,బోలెద్దూ జైలు,రెడపంగు రాము, రేపాకుల కోటయ్య, తిప్పని ఎలమంద, జింజిరాల సైదులు,దాసరి రాములు, పాశం నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఎడిటర్ ను బెదిరిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

Satyam NEWS

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Satyam NEWS

Leave a Comment