37.2 C
Hyderabad
May 6, 2024 20: 03 PM
Slider జాతీయం

ఇక ప్రయివేటు రైళ్లు వచ్చేస్తున్నాయోచ్

private-trains-feat

15 మార్గాలలో ప్రయివేటు రైళ్లను పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నది. తొలి దశలో 15 రూట్లను ప్రయివేటు వారికి అప్పగించేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించి అందుకు అనుసరించాల్సిన విధి విధానాలను ఖరారు చేసింది. కేంద్ర మంత్రి వర్గం ప్రైవేట్ రైల్ సర్వీసు కోసం ఆమోదించాల్సిన 15 రైల్వే లైన్ల జాబితాను ఆమోదించింది.

న్యూ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలోని మెట్రో నగరాల కనెక్టివిటీని మెరుగుపరచడం ప్రధాన ప్రాధాన్యతగా చెబుతూ మంత్రి వర్గం ఈ జాబితాను ఆమోదించింది. ఈ మార్గాల్లో రైలు సర్వీసు నిర్వహించడానికి 15 రోజుల్లోగా అర్హతగల ప్రైవేటు పారిశ్రామికవేత్తల నుండి దరఖాస్తులను రైల్వే మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. 

తదుపరి దశలో అర్హత గల దరఖాస్తుదారుల షార్ట్‌లిస్ట్‌ను సిద్ధం చేస్తారు. ప్రైవేట్ సేవ కోసం సిద్ధమైన మార్గాలలో 10 పెద్దవి 5 మార్గాలు చిన్నవి ఉన్నాయి. ముంబై-కోల్‌కతా, ముంబై-గౌహతి, న్యూఢిల్లీ-ముంబై, తిరువనంతపురం-గౌహతి, న్యూఢిల్లీ-కోల్‌కతా, న్యూఢిల్లీ-బెంగళూరు, న్యూ ఢిల్లీ-చెన్నై, చెన్నై-కోల్‌కతా, చెన్నై-జోధ్‌పూర్‌లు పొడవైన మార్గాలు కాగా లక్నో-గోరఖ్‌పూర్, కోటా-జైపూర్, చండీగఢ్-లక్నో, నాగ్‌పూర్-పూణే, విశాఖపట్నం-తిరుపతి, తిరువనంతపురం-గౌహతి మార్గాలు నిడివి తక్కువగా ఉన్నవి.

రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ మాట్లాడుతూ ప్రైవేటు పారిశ్రామికవేత్తలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. ఎంచుకున్న మార్గాల్లో రైలు నడపడానికి, రైలులో వినోదం, దుప్పట్లు, ఆహారాన్ని అందించడానికి మాత్రమే ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుంది. 

భారత రైల్వేకు మౌలిక సదుపాయాలు, రైల్వే లైన్లు, లాకింగ్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థలపై నియంత్రణ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు తమ సొంత రైళ్లను ఉపయోగించుకోవచ్చు లేదా ఇండియన్ రైల్వే నుండి రైళ్లను తీసుకోవచ్చు. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య అంచనా కమిటీ ఆమోదించింది.  రైల్వే మంత్రిత్వ శాఖ అర్హులైన నాలుగు లేదా ఐదు ప్రైవేట్ సర్వీసు ప్రొవైడర్లను ఎన్నుకుంటుంది.

“మేక్ మై ట్రిప్” తో సహా ట్రావెల్ అండ్  టూర్ ఆపరేటర్లు ప్రైవేట్ రైలు సేవలను నిర్వహించడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. ఆసక్తిగల ప్రైవేటు పారిశ్రామికవేత్తల సందేహాలను తొలగించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చే వారం సమావేశమవుతుంది. 

Related posts

గంగమ్మ తల్లికి  సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా  సంతోషం

Satyam NEWS

శాల్యూట్ టు ప్రకాశ్ రాజ్: మీరూ సాటివారిని ఆదుకోండి

Satyam NEWS

విశాఖ సిటీ వాసవి క్లబ్ డిస్టిట్ వైస్ గవర్నర్ గా కందుల నియామకం

Satyam NEWS

Leave a Comment