39.2 C
Hyderabad
May 4, 2024 19: 45 PM
Slider ఖమ్మం

మాజీ సైనికుల సంక్షేమానికి కార్యక్రమాలు

#Collector V.P

మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా సైనిక బోర్డు సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ సైనికుల కుటుంబాలకు, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారం, పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.

మునిసిపల్, పంచాయతీల నుండి ఆస్తి పన్ను మినహాయింపు విషయమై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. బకాయిల మొత్తానికి మినహాయింపు ఉత్తర్వులు సంబంధిత అధికారులు జారీచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

గ్యాలంటరీ అవార్డ్ గ్రహీత ఎన్. రోశయ్య కు నగదు గ్రాంట్ చెల్లింపుకు చర్యలు చేపట్టాలన్నారు. గన్ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసిన మాజీ సైనికుల దరఖాస్తుల పరిష్కారం వెంటనే అయ్యేలా చూడాలన్నారు. మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన వారికి ప్రత్యేకంగా ఉద్యోగ మేళా నిర్వహించాలన్నారు.

జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని డబల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో మాజీ సైనికులకు 2 శాతం ఇండ్ల కేటాయింపులు చేపట్టాలన్నారు. స్వయం ఉపాధికల్పనకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం పై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాజీ సైనికులకు కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.

మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జిల్లా ఇంచార్జ్ సైనిక సంక్షేమ అధికారి శ్రీరామ్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, డిఆర్డీవో విద్యాచందన, డిపివో అప్పారావు, డిపిఆర్వో ఎం.ఏ. గౌస్, నాన్ అఫీషియల్స్ కె. నవీన్, ఎస్.ఎం. అరుణ్, వై. రామకృష్ణ, కె. నరేష్, ఎల్. భాస్కర్, పి. రవి మారుతి, అధికారులు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

Back to pavilion: మళ్లీ బీజేపీలో చేరిన విజయశాంతి

Satyam NEWS

మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి

Bhavani

జనతా కర్ఫ్యూ: నేను ఇంట్లోనే ఉన్నాను మీరూ ఉండండి

Satyam NEWS

Leave a Comment