38.2 C
Hyderabad
April 29, 2024 13: 48 PM
Slider వరంగల్

మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి

#Dr. Anita Reddy

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ , సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్, అనురాగ్ సొసైటీ ప్రసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన హనుమకొండ లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సృందన మానసిక మరియు బధిరుల ఆశ్రమం, స్వధార్ మహిళా ఆశ్రయం మరియు లార్డ్ వృద్ధ ఆశ్రయం లో డాక్టర్ అనితా రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పిల్లలు దేశభక్తి గీతాలు పాడారు.

ఆట, పాటలతో అలరించారు. డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండే పిల్లలకు దేశభక్తి అలవాటు చేయాలని, ప్రజలందరు దేశభక్తి కలిగి ఉండాలని, ఎందరి మహనీయుల త్యాగఫలితంగా మనకు స్వాతంత్ర్యము వచ్చిందో తెలియచేసారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ అనితా రెడ్డి ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.

అనంతరం పిల్లలకు సీౄట్స్, బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు, వసుధ, హరిత, సుచరిత, శైలజ, నరేష్,అజయ్ తదితరులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Related posts

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

Satyam NEWS

సజ్జల వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణే

Bhavani

దళితులను అవమానించిన కొల్లాపూర్ ఎస్ ఐ పై డీజీపీకి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment