29.7 C
Hyderabad
April 29, 2024 09: 49 AM
Slider ముఖ్యంశాలు

తిరోగమన దిశగా బిజెపి

#CPI

దేశ వ్యాప్తంగా బిజెపి తిరోగమనం ప్రారంభమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు, రాజకీయాలను, మతాన్ని కలిపి లబ్ది పొందాలని చూసిన బిజెపికి కర్నాటక ప్రజలు తగు గుణపాఠం చెప్పారన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఖమ్మంజిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. మహ్మద్ మౌలానా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ బిజెపి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు దిగజారుడు విధానాలను అవలంభిస్తుందని ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు.

ఆర్థికంగా దేశాన్ని దివాళా తీయించిన బిజెపి మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య విభజన తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కర్నాటకలో అమిత్, మోడీల ఎత్తుగడలు కానీ, పారాయణాలు కానీ పని చేయలేదని రానున్న కాలంలో దేశ వ్యాప్తంగా బిజెపికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన తెలిపారు.

ప్రజాచైతన్యంతోనే మార్పు ప్రారంభమవుతుందన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో బిజెపికో హఠావో దేశికో బదావో అనే నినాదంతో గ్రామ గ్రామాన సిపిఐ చేపట్టిన ప్రజాపోరు యాత్రకు విశేష స్పందన లభించిందన్నారు. లక్షలాది మందికి పార్టీ సందేశాన్ని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాన్ని, ప్రస్తుత రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సమితి నిర్ణయించిందన్నారు.

జూన్ నాలుగున కొత్తగూడెంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూనంనేని తెలిపారు. సిపిఐ బలాన్ని ప్రతిభింభింపజేసే రీతిలో బహిరంగ సభను నిర్వహించనున్నామన్నారు. ఈ బహిరంగ సభ జయప్రదానికి గ్రామ స్థాయి నుంచి సభలు, సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తామని ఆయన తెలిపారు.

ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, జాతీయ నాయకులు కె. నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, గోరేటి వెంకన్న తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్ కె జానిమియా, గోవిందరావు, ఎపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రిబ్యూట్: కర్మయోగి పి వి నరసింహారావు

Satyam NEWS

5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam NEWS

బిగ్ డేటా పై ఆన్ లైన్ లో సదస్సు

Satyam NEWS

Leave a Comment