25.2 C
Hyderabad
October 15, 2024 11: 08 AM
Slider మహబూబ్ నగర్

ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులపై కేంద్రం కుట్ర

kollapur dharna

ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం సరైనది కాదని మాల చైతన్య సమితి ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు వారు కొల్లాపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మాల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కేశవులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాస్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో లో భారతదేశం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సరైనది కాదని, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు.

వెంటనే భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పదోన్నతులు పొందుతుంటే వారిహక్కులను కాలరాయడం కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమని విమర్శించారు. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు విద్యార్థులు మేధావులు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ ఏకమై దళితుల హక్కులను హరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే విధంగా రివ్యూ పిటిషన్ వేయాలని చైతన్య సమితి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసులు, మండల అధ్యక్షులు సురేందర్ బాపనపల్లి సందీప్ బో లే దు ల ఉపేందర్ అరుణ శివ బండి వెంకటస్వామి వెంకటేష్ అవుట కేశవులు హౌజా వెంకటేష్ పూలే వెంకట స్వామి శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మన జగనన్న మారిపోయాడు ఇక అంతా మంచే

Satyam NEWS

చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ధనబలం

Satyam NEWS

పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్: జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment