38.2 C
Hyderabad
May 3, 2024 21: 27 PM
Slider గుంటూరు

డ్రైవర్లు తప్పనిసరిగా గా కోవిడ్ రక్షణ చర్యలు తీసుకోవాలి

#RTA Narasaraopet

వాహనాన్ని నడిపే ప్రతి ఒక్క డ్రైవరు కోవిడ్ రక్షణ చర్యలు తీసుకోవాలని నరసరావుపేట రీజినల్ ట్రాన్స్ పోర్టు అధికారి ఏ రమేష్ కుమార్ కోరారు. ఇందులో భాగంగా స్థానిక రోడ్ సేఫ్టీ ఎన్జీవో వారి ద్వారా డ్రైవర్లకు శానిటైజర్ బాటిల్, క్లాత్ మాస్క్, ఫేస్ మాస్క్, సేఫ్టీ వాటర్ బాటిల్, సోపు తో కూడిన కిట్టు ను ప్లాస్టిక్ రహిత గుడ్డ సంచి కిట్ ను ఆర్ .టి. ఓ ద్వారా  అందచేశారు.

ఈ సందర్భంగా యన్. జి. ఓ ప్రతినిధి పద్మజ మాట్లాడుతూ డ్రైవర్లు ఏదైనా వస్తువు పట్టుకునేటప్పుడు తప్పనిసరిగా శానిటైజర్ తో చేతులు శుభ్రం పంచుకోవాలని, ఫేస్ మాస్క్ వల్ల ఎదుటివారి నోటి నుండి వచ్చే తుంపర్లు ను అడ్డుకోవచ్చునని అన్నారు.

మంచినీరు కూడా సొంత వాటర్ బాటిల్ ద్వారానే వాటర్ తీసుకుని వాడుకోవాలని  అన్నారు. డ్రైవర్లు తమ వాహనంతో ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరచుగా ప్రయాణంలో ఉంటారు కాబట్టి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు.

Related posts

17 నుంచి 26వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

నల్లబజారులో అమ్ముతున్న కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

తప్పుల తడకగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Bhavani

Leave a Comment