38.2 C
Hyderabad
April 29, 2024 22: 12 PM
Slider గుంటూరు

నల్లబజారులో అమ్ముతున్న కరోనా వ్యాక్సిన్

#Dr.Chadalawada

కరోనా వ్యాక్సిన్ బ్లాక్ లో వేయడానికి కారకులైన ప్రభుత్వ అధికారులను తక్షణమే సస్పెండ్ చెయ్యాలని గుంటూరు జిల్లానరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.

అధికారుల అండదండలతో ఒక ఆర్ ఎం పీ స్థానిక నరసరావుపేటలో కోవీషీల్డ్, కోవాక్సిన్ లను ప్రజల వద్ద ఇష్టానుసారంగా డబ్బులు అక్రమ వసూళ్ళకు పాల్పడి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాడని ఆయన అన్నారు.

ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా వేయవలసిన వ్యాక్సిన్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటుంటే ప్రభుత్వ అధికారులు ఎంత గాఢమైన నిద్రలో ఉన్నారో అర్థమౌతుందని డాక్టర్ చదలవాడ ధ్వజ మెత్తారు.

ఈ ఘటన వెనుకనున్న సూత్రధారులను, పాత్రధారులను పోలీసులు తక్షణమే బహిరంగపర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఈ ఘటనకు పాల్పడి కేంద్ర,ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన వ్యాక్సిన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటం సిగ్గుచేటని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ వ్యాక్సిన్ పంపిణీ సక్రమంగా పారదర్శకంగా కేంద్రాలలో వచ్చిన వ్యాక్సిన్లు ఎంత ? ఎంత మందికి ఆరోజు వ్యాక్సినేషన్ చేశారు అనేది సక్రమైన లెక్కలు చెప్పాలని కోరారు.

కరోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా కట్టడి చేసి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

నరసరావుపేట రేషన్ మాఫియా, కల్తీపాలు, నకిలీ శానిటైజర్లు, కల్తీ నునెలు తదితర వ్యాపారాలకు అడ్డాగా మారిందని తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యేకి చిత్తశుద్ది ఉంటే ఈ ఘటనలో సూత్రధారులపై పాత్రధారులపై చర్యలు చేపట్టమని కలెక్టర్ ను కోరేవారేనని,అధికారులు తక్షణమే ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు.

Related posts

మందు దుకాణం పై ఆగ్రహించిన మహిళా లోకం

Satyam NEWS

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలన్న సిఐటియు

Satyam NEWS

బ్యాంకును ముట్టడించిన వైసీపీ నాయకులు

Satyam NEWS

Leave a Comment