27.7 C
Hyderabad
May 4, 2024 07: 42 AM
Slider మహబూబ్ నగర్

డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై నిరసన

#Kalwakurthy Lorry woners

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో డీజిల్ పెట్రోల్ ధరల పెంపుపై కల్వకుర్తి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ పట్టణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రోజుకు లీటర్ పై 30 పైసలు 40 పైసలు పెంచుతూ కానరాని విధంగా  నేటికీ పది రూపాయలు వరకు ధరలు పెంచారని తెలిపారు.

అసలే లాక్ డౌన్ సందర్భంలో లారీలు రోడ్ ఎక్కడమే కష్టమే అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవనం సాగించడమే కష్టంగా మారిందని రోడ్ టాక్స్ లు మాఫీ చేయలేదని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకునేది పోయి పెట్రోల్ డీజిల్ పెంచు కుంటూ పోవడంపై లారీ ఓనర్స్ అసోసియేషన్  నిరసన వ్య క్తం చేశారు.

ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి నయీమ్ మాట్లాడుతూ వెంటనే డీజిల్ ధరలు తగ్గించాలని క్వాటర్ టాక్స్ లు మాఫీ చేయాలంటూ పెంచిన ఇన్సూరెన్స్ తగ్గించాలని సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని టోల్ టాక్స్ లు తగ్గించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి  లారీ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్వేతా మహంతి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ

Bhavani

‘‘రోజా’’ పువ్వుకు ముళ్లు మొలిపిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి

Satyam NEWS

హే భగవాన్ మా దుస్థితి పట్టించుకొనే వారు లేరా?

Satyam NEWS

Leave a Comment