30.7 C
Hyderabad
April 29, 2024 06: 57 AM
Slider నిజామాబాద్

సమాచార హక్కు చట్టం కాలమానిని ఆవిష్కరణ

#Information Act

సమాచార హక్కు చట్టం క్యాలెండర్ ను అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ నేడు ఆవిష్కరించింది. బిచ్కుంద మండలంలోని పోలీస్ స్టేషన్, తహశీల్దార్, ఎంపీడీఓ,సబ్ రిజిస్టర్, ఐకేపీ కార్యాలయాల్లో ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిటీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపై ఉందన్నారు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనితీరు, కార్యక్రమాలను తెలుసుకోవచ్చు అన్నారు.

వ్యక్తిగత సమాచారం మినహా, ప్రభుత్వ అధికారుల పనితీరును ప్రశ్నించే హక్కు కేవలం సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రతి భారతీయ పౌరుడికి ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టం క్యాలెండర్ ను అన్ని రూపాలుగా ప్రజలకు అవగాహన కలిగించే  సమాచార హక్కు చట్టం సభ్యులను ఆయా శాఖల  అధికారులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్న తో పాటు పోలీస్ సిబ్బంది, సమాచార హక్కు చట్టం బిచ్కుంద మండల అధ్యక్షుడు ఎతొండా శంకర్ పాల్గొన్నారు.

Related posts

ఈ మున్సిపాలిటీ వారు చట్టం చదవరు..చెబితే వినరు..

Satyam NEWS

2020లో 203 ఉగ్ర‌వాదులు హ‌తం… పాక్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌దా?

Sub Editor

ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని

Satyam NEWS

Leave a Comment