39.2 C
Hyderabad
May 4, 2024 20: 55 PM
Slider కృష్ణ

గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు

hen fight

గ్రామాల్లో ఎవరైనా,ఎక్కడైనా కోడి పందాలు, జూదాలు  నిర్వహిస్తే హైకోర్ట్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తప్పవని గన్నవరం మండల ఎగ్జికూటివ్ మేజిస్టేట్,తాహశీల్ధార్ వి.మురళీ కృష్ణ అన్నారు. గురువారం తాహశీల్ధార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అంతే కాకుండా పందాలకు స్థలాలు ఇచ్చిన వారికి, ఫ్లెక్సీలు, మైక్ సెట్లు, లైట్లు ఏర్పాటు చేసిన వారి పై తగిన చర్యలు ఉంటాయన్నారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని, లేని పక్షంలో ఇబ్బందులకు గురికావలసి వస్తుందని ఆయన హితోపదేశం చేశారు. ఆయా గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారాన్ని ఫోటోలు, వీడియో ల రూపంలో చిత్రీకరించి తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎండీఓ.వై.సుభాషిణి,ఈ. ఓ.పి.ఆర్డీ.కె.వెంకటేశ్వరవు, డిప్యూటీ తాహశీల్ధార్ ఏ. శ్రీనివాసరావు,సిఐ.కె.శ్రీనివాసరావు,ఎసై.వాసిరెడ్డి శ్రీను,పశుసంవర్ధక శాఖ విఏఎస్.రెడ్డమ్మ వివిధ ప్రాంతాల విఆర్వో, వి.ఆర్.ఏ లు పాల్గొన్నారు.

Related posts

బండి సంజయ్ పాదయాత్ర తో ప్రజల్లో వెలిగిన చైతన్య జ్యోతి

Satyam NEWS

22 నుండి మార్చి 3వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

దేవుడా కరోనా రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడు

Satyam NEWS

Leave a Comment