30.7 C
Hyderabad
May 5, 2024 03: 50 AM
Slider ముఖ్యంశాలు

వంగర, లక్నేపల్లి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి

#MinisterSrinivasaGoud

దివంగత ప్రధానమంత్రి , తెలంగాణ ముద్దుబిడ్డ, స్వర్గీయ PV నరసింహ రావు స్వగ్రామం వంగర, లక్నేపల్లి లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే అంశంపై  రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ నేడు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న ఈ పర్యాటక కేంద్రాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, PV కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సలహా, సూచనల మేరకు ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

టూరిజం, కల్చరల్ శాఖ అధికారులు కన్సల్ టెంట్ ల ద్వారా రూపొందించిన  ప్రాజెక్టు రిపోర్ట్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కన్సల్ టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS

ఉపాధ్యాయ పోస్టులు పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

Satyam NEWS

పర్యావరణ ప్రభావంపై శిక్షణ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment