39.2 C
Hyderabad
May 3, 2024 13: 46 PM
Slider వరంగల్

ఉపాధ్యాయ పోస్టులు పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

#dyfi

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా విద్యాశాఖ ప్రకటించిన 6612 (5089) పోస్టులే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన 13086 పోస్టులు భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) ములుగు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డీఎస్సీ ద్వారా కలెక్టర్ కార్యాలయంలో ఏ.ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ మాట్లాడుతూ సొంత రాష్ట్రం తెలంగాణ కోసం ఉద్యోగాల ప్రిపరేషన్ వదిలేసి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని మా బతుకులు మారుతాయని ఉద్యమా బాట పట్టి ఉద్యమాల్లో పాల్గొని సొంత రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నాక ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశ ఎదురైందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2017లో ఒక్కోసారి మాత్రమే డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేశారు. అదే మనతో విడిపోయిన పక్కా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి నాలుగైదు సార్లు డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. కానీ తెలంగాణలో మాత్రం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సర్వేలు నిర్వహించి 20,000 నుంచి 30 వేల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయా పోస్టులు అన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఏమాత్రం లెక్కలోకి తిసుకోకుండా స్వయానా ముఖ్యమంత్రి 13086 పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. స్వయంగా విద్యాశాఖ నిర్వహించిన సర్వే లోనే 9370 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అదే విధంగా పదోన్నతులు కల్పించాల్సిన పోస్టులు 9979 ఉన్నాయని వాటన్నింటినీ భర్తీ చేసి పదోన్నతులు కల్పించకుండా అవేమీ పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా నిరుద్యోగుల పట్ల చాలామొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

విద్యాశాఖ 6612 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రతి పాఠశాలను సర్వే చేసి ఎక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో ఎక్కడ విద్యార్థులు ఉన్నారు. అనేకమంది పేద మధ్యతరగతి పిల్లలు చదివే పాఠశాలలో విద్యా అందించవచ్చని వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ లో జాబులు (పోస్టులు )పెంచాలని డిమాండ్ చేశారు. లేని యెడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు సునీల్ దేవేందర్ చంటి స్వామి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విపత్తు సంభవిస్తే తక్షణమే సాయం అందిస్తాం

Satyam NEWS

తుని మున్సిపాల్టీలో చరిత్ర పునరావృతం

Satyam NEWS

బ్రహ్మోత్సవాలలో శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం

Satyam NEWS

Leave a Comment