33.2 C
Hyderabad
May 15, 2024 20: 51 PM
Slider ముఖ్యంశాలు

దమ్ముంటే నన్ను పార్టీ నుంచి బహిష్కరించుకోండి

#raghuramakrishnamraju

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్న తనకు స్వాగతం చెబుతున్న వారిపై అక్రమ కేసులను నమోదు చేస్తున్నారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రెండున్నర ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్న తనకు స్వాగతం పలికే వారిపై ప్రభుత్వ పెద్దలతో కలిసి పోలీసులు కేసులు పెడుతుంటే, తన రాకను నిరసిస్తున్న వారికి మాత్రం సూట్ కేసులను అందజేస్తున్నారన్నారు. తనకు స్వాగతం పలుకుతున్న వారిని ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లయితే, వారిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా?, ఎందుకని ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రివెంటివ్ అరెస్టులు చేసిన ఎవరు భయపడవద్దని రఘురామ కోరారు. అరెస్టు చేసిన పోలీసు అధికారుల పేర్లను నమోదు చేసుకోవాలని, వారిపై ప్రైవేటు కేసులు పెట్టి, న్యాయపోరాటం చేద్దామని చెప్పారు. తన నియోజకవర్గానికి తాను వస్తుంటే, రాజుగారు రారని కొంతమంది బెట్టింగులు వేస్తున్నట్లు తెలిసిందన్నారు. సకల శాఖ మంత్రి బెట్టింగులు వేస్తున్న వారికి తాను చెప్పేది ఒకటేనని… వస్తున్న నియోజకవర్గానికి వస్తున్న… ఎలా వస్తాను మాత్రం చెప్పనని రఘురామ ప్రకటించారు.

నియోజకవర్గానికి తన రాకను వ్యతిరేకిస్తూ కొంతమంది ఆందోళన చేస్తున్నారని సాక్షి దినపత్రిక జిల్లా ఎడిషన్ ఫస్ట్ పేజీలో వార్తా కథనం ప్రచురించారని రఘురామ తెలిపారు. స్థానిక పైడాటిస్టులతో సాక్షి దినపత్రిక ఆడిస్తున్న చీఫ్ ట్రిక్స్ అని వండిపడ్డారు. తన రాకను నియోజకవర్గ ప్రజలంతా స్వాగతిస్తున్నారని, అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారని చెప్పారు. తన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న జిల్లా కలెక్టర్ కు కోర్టు చివాట్లు పెట్టిందన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీసులు దొంగ కేసులను పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది అన్నారు.

అల్లూరి విగ్రహావిష్కరణ సభలో పాల్గొనే ప్రజలను భయభ్రాంతులను చేయడానికి, ముందు వరుసలో కూర్చునేవారు తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసేలా… ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలిసిందని రఘురామా వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మూడు లక్షల మంది వాలంటీర్లలో అంతా మన పార్టీ కార్యకర్తలేనని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్న విషయాన్ని రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు. ప్రభుత్వ ధనంతో పార్టీ కార్యకర్తలకు జీతాలను ఇస్తున్నారని, ఆ జీతాల మొత్తాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అది చాలాదన్నట్లు సాక్షి దినపత్రిక సర్కులేషన్ పెంచుకోవడానికి, వాలంటీర్ల పేరిట 200 రూపాయలు ప్రభుత్వ ధనాన్ని సాక్షికి కట్టబెడుతున్నారని చెప్పారు. మీ పేపర్ కోసం మీరు ఏమైనా చేయవచ్చు కానీ ప్రశ్నిస్తే తప్ప అంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్లీనరీ సమావేశంలో దమ్ముంటే తనను బహిష్కరించాలని సవాల్ చేశారు. కొంతమంది తనని రాజీనామా చేయమంటూ డిమాండ్ చేస్తున్నారని, అయితే తాను తన సొమ్ము, తన ముఖాన్ని చూపించుకొని ప్రజలను ఓట్ల అడిగి గెలిచానన్నారు.

తనని రాజీనామా చేయమని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. డ్వాక్రా మహిళలతో ప్లీనరీ సమావేశాలను నిర్వహించే దుస్థితికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరిందన్న ఆయన, ఒక్కొక్కరుగా పార్టీ విధానాలు నచ్చక ఎంతో మంది రాజీనామాలు చేస్తున్నారని చెప్పారు. ప్రధాన ప్లీనరీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్న ఆయన, కనీసం పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కైనా అందిందో లేదోనని సందేహం వ్యక్తం చేశారు.

చెల్లి వచ్చే ప్రశ్న లేదని, తల్లి అయిన వస్తారో రారోనని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో, తనను అభిమానించే వారిపై పోలీసులు దొంగ కేసులు పెడుతున్నారని, ఇప్పటికైనా పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. మా పార్టీ పెద్దల బ్యాక్ గ్రౌండ్ వేరని, వారి మాటలు ఇప్పుడు వింటే, రేపు పోలీసు అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ సాయి రెడ్డి పేరిట హర్షవర్ధన్ తో ట్వీట్లు రాయిస్తున్నారన్నారు. తాను ముందే చెప్పానని సాయి రెడ్డి అంతా బ్యాడ్ ఫెలో కాదని… అయినా తనని తిడితే ఊరుకునే రకం కాదని చెప్పుకువచ్చారు. గిల్లితే గిల్లించుకునే రకం కాదని, గిల్లితే గిల్లే రకమని పేర్కొన్నారు.

Related posts

వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తున్నారు

Satyam NEWS

బెంగాల్ SSC స్కామ్ కేసులో ప్రముఖ సినీ నటి

Satyam NEWS

సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు

Satyam NEWS

Leave a Comment