26.2 C
Hyderabad
May 10, 2024 22: 36 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

#LordBalaji

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు  ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ జరిగింది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మ‌వార్లు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

పెద్దశేష వాహనం

ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికి, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే తనకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.

Related posts

వాటర్ హార్వెస్టింగ్ విధానాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలి?…వీరేం చేశారో చూడండి

Satyam NEWS

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

Leave a Comment