36.2 C
Hyderabad
May 15, 2024 19: 10 PM
Slider శ్రీకాకుళం

ఎమ్మెల్యే కుమారుడిపై ఎస్సీ,ఎస్టీ కేసుకు సంఘాల డిమాండ్‌

Dalitha

దళిత మహిళ కొత్తూరు తహసీల్దార్ పై, డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందిపై కులం పేరుతో దూషించి విధులను అడ్డుకున్న అగ్రకుల పెత్తందారులు మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు కుమారుడు కలమట రమేష్ (విఆర్వో) గండివలస రాంప్రసాద్ పై తక్షణమే sc/st అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్టు చేయాలని జిల్లా దళిత సంఘాల జేఏసీ జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు.

మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జిల్లా దళిత సంఘాలు ఆధ్వ‌ర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, మాదిగ దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడు రానా శ్రీను మాట్లాడుతూ దళిత మహిళ కొత్తూరు తహసీల్దార్ను, ఇతర రెవెన్యూ సిబ్బందిపై కులం పేరుతో దూషించి సుమారుగా వారం రోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణమని అన్నారు.

పాలకొండ డీఎస్పీ దర్యాప్తు పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి దళితులు ఆశాజ్యోతి డాక్టర్ బాబుసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6 లోగా కలమట రమేష్, గండివలస రాంప్రసాద్ లను అరెస్ట్ చేయకపోతే డిసెంబరు 7 తేదీన కొత్తూరు అంబేద్కర్ కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. దేశంలో రాష్ట్రంలో దళితులు పైన విపరీతంగా దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరించడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో మాలమహనడు కొత్తూరు మండల అధ్యక్షుడు తొంపల తిరుపతిరావు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమన రమేష్, గొడగల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దీర్ఘాసి హరీష్, కాటరీ కమల, బి ప్రసాద్, డి తిరుముల, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాకోటి రాంబాబు, దోమన మోహనరావు, టి మోహన్, తలచంద్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

6న జర్నలిస్టుల సమస్యలపై సీపీఎం ధర్నా

Murali Krishna

రాంచీలో రెండో టీ20పై నీలిమేఘాలు.. హైకోర్టులో పిల్

Sub Editor

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Murali Krishna

Leave a Comment