ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు కేసులో ఈ నెల 21మంగళవారం బెంగళూరులోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సినీనటి రశ్మికాతో పాటు ఆమె తండ్రి మదన్, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. నటి రశ్మికా మందన్న నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు జరిపారు.
ఇందులో కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రశ్మికా నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని మదన్ చెప్పారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరవుతామని ఆయన చెప్పారు