42.2 C
Hyderabad
May 3, 2024 18: 47 PM
Slider గుంటూరు

గిరిజనుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్న ప్రభుత్వం

#tribal

రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమాభివృద్ధి కోసం ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని ST కమిషన్ చైర్మన్ కుంబా రవికుమార్ అన్నారు. గిరిజనుల సంక్షేమాభివృద్ధి గురించి జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆధ్వర్యంలో నేడు పల్నాడు జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

గిరిజన ఉద్యోగుల రూల్ ఆఫ్ రిజర్వేషన్, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ మరియు గిరిజనుల అభివృద్ది గురించి జిల్లా అధికారులను కుంబా రవికుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ST ల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరు ఆశాజనకంగా లేదని, జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ లాంటి సమర్థవంతమైన అధికారులు వీటి అమలుపై దృష్టి సారించి,తమ కింది అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.

ఆయా ప్రభుత్వ శాఖలైన అటవీ, రెవెన్యూ, విద్యుత్తు, విద్యా, ఆర్.టి.సి, ఇతర ఉద్యోగ శాఖలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. కమీషన్  ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూల్ ఆఫ్ రిజ్వేషన్ల పై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో జరిగే సమావేశానికి అన్నీ విషయాల్లో సమన్వయం చేసుకొని, సమర్థ వంతంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరో మూడు నెలలు తరువాత  ఇదే జిల్లాలో మళ్ళీ ఎస్.టి కమీషన్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అప్పటికల్లా సరైన సమాచారం తో అధికారులు వచ్చి, ఎస్.టి ల అభివృద్ధికి చేపట్టిన పనులు,పూర్తి చేసిన నివేదికను కమీషన్ కు పంపాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవోదయం కార్యక్రమం ద్వారా జిల్లాలో ఎస్సీ, ఎస్.టి సామజిక వర్గాల ప్రజల విద్యా,ఉపాధి, ఉద్యోగ,పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 1.60 లక్షల మంది గిరిజన తెగల ప్రజలు జీవిస్తున్నారని, సామాజిక వర్గాల వారిగా తెలిపారు. రాష్ట్రంలో మరో అతి పెద్ద గిరిజనులు ఈ ప్రాంతం లో జీవిస్తున్నారని తెలిపారు. గిరిజనుల అభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లా కలెక్టర్ చైతన్యంతో గిరిజనుల జీవనాధారం కోసం జరుగుతున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్.టి కమీషన్ సభ్యులు లీలా సురేష్, డి.ఆర్.ఓ వినాయకం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి వరలక్ష్మీ, ఆయా శాఖల జిల్లా అధికారులు, పలు ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కంగనా రనౌత్ కు షాక్‌.. నడిరోడ్డుపై అడ్డగించిన రైతులు

Sub Editor

ఏపిలో కొత్త జిల్లాకు పివి నరసింహారావుకు పేరు పెట్టాలి

Satyam NEWS

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరచుకోవాలి

Satyam NEWS

Leave a Comment