39.2 C
Hyderabad
May 4, 2024 19: 58 PM
Slider శ్రీకాకుళం

సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకోవాలి

#destinations safely

ట్రాఫిక్ రూల్స్ పాటించి, సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరాలంటూ శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో ట్రాఫిక్ ఎవేర్నెస్ అవగాహనా సదస్సులో శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ ఎన్. లక్ష్మణరావు తెలిపారు.స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీ, శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.రాంప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.

విద్యార్ధినీ,విద్యార్ధులను ఉద్దేశిస్తూ,వారు మాట్లాడుతూ చిన్ననాటి నుండే ప్రతి ఒక్క విద్యార్థికి సామాజిక భాధ్యత వుండాలని మీ జీవితం మీ చేతిలో ఉందని, రూల్స్ పాటించకపోతే ప్రమాదాలు జరుగుతాయని, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడపటం అతి ప్రమాదమన్నారు. మరీ ముఖ్యంగా సిగ్నల్‌లో గ్రీన్ లైట్ వచ్చినప్పుడే ముందుకు వెళ్లాలని, సిగ్నల్స్ వద్ద వాహనాలను నిలిపే లైన్‌ను క్రాస్ చేయవద్దంటూ విద్యార్ధులకు,చెప్తూ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు.

అనంతరం ప్రిన్సిపాల్ ఆర్.రాంప్రసాద్ మాట్లాడుతూ వాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని విద్యార్థినిలకు సూచించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్.ఐ.ఎన్.లక్ష్మణ రావు విద్యార్ధినీ, విద్యార్ధులను విద్యార్ధినీ,విద్యార్ధులు తయారు చేసిన నమూనాలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం ప్ల కార్దులు పట్టుకొని విద్యార్ధినీ,విద్యార్ధులు స్థానిక సూర్యమహల్ జంక్షన్ వరకు నినాదాలు చేశారు

ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్దినేట‌ర్ ఎ.బాలరాజు, శ్రీకాకుళం జిల్లా చైతన్య పాఠశాలల రీజనల్ ఇంచార్జి ఎస్.రామి నాయుడు, జోనల్ అకదమిక్ డీన్ పి. మోహన్ బాబు, అకదమిక్ డీన్ ఎ.హరి ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ ఇంద్ర మౌళి ఐకాన్ ఇంచార్జి బి.జనార్ధన్ ,సి భ్యాచ్ ఇంచార్జి ఎస్.లక్ష్మీకాంత్, ఎస్.బ్యాచ్ ఇంచార్జి బి.ప్రసాద్, మెడికాన్ ఇంచార్జి టి.రామ్మోహన్, ప్రైమరీ ఇంచార్జి కె.స్వప్న ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్ధినీ,విద్యార్ధులు పాల్గొన్నారు

ఈ విషయంపై ఉత్తరాంధ్ర జిల్లాల ఏ.జి.యం ఎమ్.వి.సురేష్ విశేషంగా స్పందిస్తూ, ఇంతటి మహత్తర కార్యక్రమం ను విజయవంతంగా నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ ను, ఉపాధ్యాయ సిబ్బందిను,విద్యార్ధినీ విద్యార్ధులను అభినందించి,హర్షమును వ్యక్తం చేశారు.

Related posts

నోబుల్ కాజ్: ప్లాస్టిక్ రహితంగా మేడారం జాత‌ర‌

Satyam NEWS

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు పట్టాల పంపిణీ

Bhavani

మోడీని కలిసిన గీతా గోపినాథ్

Sub Editor

Leave a Comment