28.7 C
Hyderabad
April 28, 2024 05: 10 AM
Slider ముఖ్యంశాలు

విద్యార్థులు చలికి వణుకుతున్నా ప్రభుత్వం అధికారులు చెలించరా

#ajejpasha

చీఫ్ సెక్రటరీ సిఎస్ సోమేశ్ కుమార్ కు బహిరంగ లేఖ

రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా చీఫ్ సెక్రటరీ సిఎస్ సోమేశ్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు. గురువారం లేఖలోని అంశాలను అజీజ్ పాషా హుజూర్ నగర్ లో విలేకరులకు తెలిపారు. చాలా గురుకులాలలో (గీజర్)వాటర్ హీటర్స్ లేకపోవటం, కొన్నిచోట్ల ఉన్నా అవి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో విద్యార్థులు చాలా గురుకులాలలో గజగజ వణుకుతూ చన్నీళ్ళ స్నానాల వలన జలుబు,జ్వరాల బారిన పడి అనారోగ్యాల పాలవుతున్న ఘటనలు ప్రస్తుతం జరుగుతున్నాయని అన్నారు.

పలు గురుకుల రెసిడెన్సీ లలో నాసిరకంగా ఆహారం అందించడం పట్ల విద్యార్థిని, విద్యార్థులు లకు తరచూ వైరల్ జ్వరాలు, వాంతులు,కడుపులో నొప్పి,ఎదుగుదల లోపంతో విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. విద్యార్థులకు సాయంత్రం పూట అందించే స్నాక్స్ అందించవలసిన మెనూను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తమ ఇష్టానుసారం కేవలం అర కొరా ఇస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని,వివిధ గురుకులాల ను పర్యవేక్షించవలసిన ఉన్నతాధికారుల నిఘా పర్యవేక్షణ లోపంతో కొంతమంది ప్రిన్సిపాల్స్,సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, వారిపై తక్షణమే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

చలికాలం రావడంతోనే రాష్ట్రంలో సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు కష్టాలు పెరుగుతున్నాయని, దుప్పట్లు,కార్పెట్లు సరఫరా కాకపోవడంతో నేలపై చలికి వణుకుతూ అవస్థలు పడుతున్నారని,కోవిడ్‌ నేపథ్యంలో మూడేళ్లుగా అరకొర సరఫరాతో నెట్టుకువచ్చిన సంక్షేమ శాఖలు,గురుకుల సొసైటీలు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు కొనుగోళ్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మహ్మద్ అజీజ్ పాషా అన్నారు.

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుకులాల రెసిడెన్షియల్ సంక్షేమ శాఖల పరిధిలో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, సంక్షేమ వసతిగృహాలతో పాటు వెయ్యికి పైగా ఉన్న గురుకులాల్లో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఉంటున్నారని,వీరికి ఏటా బెడ్‌షీట్లు,కార్పెట్లు ఐదేళ్లకోసారి దుప్పట్లు ఇవ్వాల్సి ఉందని,ఇంతవరకు పంపిణీ కాకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంటినుంచి తెచ్చుకుని వాడుతున్నారని, మరికొందరు పాతవి,చినిగిపోయిన వాటితోనే సర్దుకుపోతున్నారని అన్నారు.

పలు హాస్టళ్లు,గురుకులాల్లో సరైన వసతులు లేవని,నివాసం,చదువు,భోజనం అన్నీ ఒకే గదిలో చేయాల్సి వస్తోందని, కిటికీలకు తలుపులు లేక పిల్లలు చలికి వణుకుతున్నారని,స్నానానికి వేడినీళ్ల కోసం వాటర్‌ హీటర్లు లేవని,తక్షణమే రాష్ర్ట ప్రభుత్వం గురుకులాల్లో,సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు కావలసిన అన్ని దుస్తులను, వస్తువులను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.వివిధ గురుకుల సంక్షేమ హాస్టల్స్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గురుకులాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరపాలని,నాణ్యమైన ఆహారాన్ని అందించాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ తన బహిరంగలేఖ ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ని కోరడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య,ముషం సత్యనారాయణ,మహమ్మద్ రజాక్ బాబా,పాశం రామరాజు,జగన్,మట్టయ్య,  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఎయిరిండియా విమానంలో ఓ షాకింగ్ సంఘటన

Bhavani

డ్రగ్స్, గంజాయి కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్

Sub Editor 2

నూతనోత్సాహాలకు నాంది తెలుగువారి ఉగాది

Satyam NEWS

Leave a Comment