37.7 C
Hyderabad
May 4, 2024 13: 40 PM
Slider ఖమ్మం

పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు

#vanama

గ్రంథాలయాలు సరస్వతి నిలయాలని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ గ్రంథాలయం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఉద్యోగార్తులు, విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పారు. పుస్తకాల చదవడం వల్ల మేధాశక్తి పెరుగుతుందని, గ్రంథాలయాలపై ఆధారపడి చదువుకున్న ఎందరో ఉద్యోగాలు సంపాదించి చక్కటి జీవితాన్ని సాగిస్తున్నారని తెలిపారు. గ్రంథాలయాల ఆవశ్యకత ఉపయోగాలు తెలిపేందుకు, పాఠకుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాటు చేసిన వారోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ మోరే భాస్కర్, గ్రంథ పాలకురాళ్లు డీ వరలక్ష్మి జి మణి మృదుల, వివిధ శాఖగ్రంథాలయ ఉద్యోగులు, విద్యార్థులు,  తదితరులు  పాల్గొన్నారు.

Related posts

హర్యానాలో 12 పిస్టల్స్ లభ్యం

Sub Editor

సమస్యల పరిష్కారం కు సత్వర చర్యలు

Satyam NEWS

సేవ్ ఆంధ్రప్రదేశ్:అమెరికాలోనూ అమరావతి ఆందోళనలు

Satyam NEWS

Leave a Comment