33.2 C
Hyderabad
May 3, 2024 23: 55 PM
Slider మహబూబ్ నగర్

దళితుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న కొల్లాపూర్ ఎస్సై

#kollapur

దళిత దండు  వ్యవస్థాపకుడు, రామాపురం  మాజీ సర్పంచ్  బచ్చల కూర బాలరాజు పై  కొల్లాపూర్ ఎస్ ఐ దౌర్జన్యం చేయడం కలకలం సృష్టించింది. తనను కులంపేరుతో బూతులు తిడుతూ పోలీస్ స్టేషన్ గేట్ బయటి వరకు ఆయన తరిమికొట్టారని బాలరాజు కొల్లాపూర్ సిఐకి ఫిర్యాదు చేశారు. సదరు ఏసై పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు.

తాను దళితుడిని అయినందుకు  ఎస్ ఐ జి. బాల వెంకటరమణ తనపై దాడి చేశారని బచ్చలకూర బాలరాజు ఆరోపించారు. తమను కాపాడి రక్షించాల్సిన పోలీసు అధికారే దళితుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి  పోలీస్ శాఖ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల  రాందాస్ అన్నారు. కొల్లాపూర్ ఎస్ఐ జి. బాల వెంకటరమణ దళితులనే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని, దళితుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు.

ఇది వరకు దళిత జర్నలిస్టుపై.. బడుగు బలహీన వర్గాల బుడగ జంగాల  వారిపై.. నేడు మాజీ సర్పంచ్ దళిత వ్యవస్థాపకుడు బచ్చాల కూర బాలరాజుపై ఎస్ ఐ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. వెంటనే అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి  ఎస్ఐ జి. బాల వెంకటరమణ ను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. పోలీస్ శాఖ ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

తెలుగు రాజకీయాల్లో ఆ నాటి సంచలనం కాట్రగడ్డ ప్రసూన

Satyam NEWS

సిమ్ కార్డు అమ్మకందారులకు కేంద్ర హెచ్చరిక

Satyam NEWS

యాక్షన్ కింగ్ అర్జున్ స్పెషల్ సాంగ్ లాంచ్

Satyam NEWS

Leave a Comment