Slider ముఖ్యంశాలు

తెలుగు రాజకీయాల్లో ఆ నాటి సంచలనం కాట్రగడ్డ ప్రసూన

#Katragadda Prasuna

కాట్రగడ్డ ప్రసూన 1982 మర్చి 29 న టీడీపీ పార్టీలో చేరిన మొదటి మహిళా నాయకురాలు. పార్టీలో చేరినప్పుడు కాట్రగడ్డ ప్రసూన వయస్సు 24 సంవత్సరాలు. 1982 ఏప్రిల్ 11 న మొదటి మహానాడు జరిగింది. మొదటి మహానాడు స్టేజీపై ఉన్నవారిలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు, కాట్రగడ్డ ప్రసూన మాత్రమే జీవించి ఉన్నారు.

అందుకు ఈ ఫోటోనే సాక్ష్యం. ఆర్థిక శాస్త్రంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉన్నత విద్యావంతురాలైన కాట్రగడ్డ ప్రసూన 1983 ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. దేశంలోనే అతి పిన్న వయస్సులో కాట్రగడ్డ ప్రసూన ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ అనారోగ్యంతో అమెరికా వెళ్లి వైద్యం చేయించుకొని వచ్చాక టీడీపీ సమావేశాల్లో కాట్రగడ్డ ప్రసూన ఎన్టీఆర్ వెంటే ఉండి చేయి పట్టి నడిపించిన ధైర్య సాహసం ఉన్న నాయకురాలు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రజాస్వామిక పరిరక్షణలో కాట్రగడ్డ ప్రసూన ఎప్పుడూ ముందుంటారు. టీడీపీ పక్షాన అనర్గళంగా గొంతెత్తి మాట్లాడటంలో ఈమె నిష్ణాతురాలు.

Related posts

నాగరమంతా విడిఎఫ్ రోడ్లు

mamatha

టీడీపీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార జోరు షురూ

Satyam NEWS

‘శ్రద్ధ విడిపోతానంటేనే అఫ్తాబ్ హత్య చేశాడు’

Satyam NEWS

Leave a Comment