31.2 C
Hyderabad
May 3, 2024 00: 40 AM
Slider విజయనగరం

రోటరీ ఆధ్వర్యంలో మట్టి గణపయ్య విగ్రహాలు పంపిణీ..!ఎక్కడంటే…?

#VijayanagaramGanesh

వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని సంరక్షించాలి అనే ఉద్దేశ్యంతో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ స్థానిక డాక్టర్ పి వి జి రాజు రోటరీ హెల్త్ సెంటర్ నందు పర్యావరణ రహిత మట్టి గణేష్ విగ్రహాలు ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

క్లబ్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు జ్యోతి ప్రారంభించారు. కార్యదర్శి గొడవర్తి జగదీష్ బాబు రోటరీ క్లబ్ సభ్యులు టీఎల్ఎన్ మూర్తి, శంకర్ రెడ్డి కట్టమూరి మధు, అశోక్ మాలు అశోక్, డాక్టర్ హెల్త్ సెంటర్ చైర్మన్ గ్రంధి సర్వరాయ గుప్త రోటరాక్ట్ క్లబ్ సభ్యులు పవన్ తదితరుల చేతుల మీదుగా 500 మట్టి గణేష్ విగ్రహాలు స్థానికులకు పంపిణీ పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ హితంగా ఉండటం కోసం కరోనా వలన ప్రజలు బయటకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మట్టి గణేష్ విగ్రహాలు ఉచితంగా క్లబ్ సర్వీస్లో భాగంగా పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. కార్యదర్శి జగదీష్ బాబు మాట్లాడుతూ మట్టి వినాయకుడు పూజ అనంతరం ఇంటిలోనే మొక్కల కుండీలలో నిమజ్జనం చేసుకోవచ్చని ఎటువంటి హానికారక రంగులు గాని, ప్లాస్టర్-ఆఫ్-పారిస్ గాని వాడలేదని అందువల్ల ఇది పర్యావరణహిత మని తెలియజేశారు.

 ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఏటా రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ తో కలిసి ఇన్నర్ వీల్ క్లబ్ కూడా కార్యక్రమాలలో పాలుపంచుకోవటం ఆనందదాయకమని తెలిపారు.

Related posts

మైలమాల శ్యాంసుందర్ కు డాక్టరేట్ ప్రధానం

Bhavani

విజయదశమి నుంచి పాలన విశాఖలో

Bhavani

ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానం

Satyam NEWS

Leave a Comment