42.2 C
Hyderabad
April 30, 2024 16: 43 PM
Slider నిజామాబాద్

మహిళలు, బాలల కోసం భరోసా కేంద్రం: ఎస్పీ సిందూశర్మ

#sindhusharma

మహిళలు, బాలల కోసం భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సిందూశర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమీపంలోని గ్రీన్ హోమ్ కాలనిలో గల భవనంలో భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిందూశర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత మహిళలు, బాలలు అధైర్య పడకుండా వారిలో ఆత్మసైర్యాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ  భరోసా సెంటర్లను ప్రారంబించడం జరుగతున్నదని అన్నారు.

దాంట్లో బాగంగానే కామారెడ్డి జిల్లాలో కూడా భరోసా కేంద్రాన్ని  ప్రారంభించుకున్నామని  తెలిపారు. నేటి నుండి బాధిత మహిళలకు, బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా 24/7 సహాయకారిగా ఉంటుందన్నారు. భరోసా సెంటర్స్ లైంగిక  వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు ఆస్పత్రులు, పోలీసు స్టేషన్లకు దూరంగా మంచి వాతావరణంలో వైద్య, న్యాయ సలహా, కౌన్సిలింగ్ వంటి అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు క్రింద అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళలు, బాలలపై నమోదైన కేసులలో  కేసు నమోదు తరువాత నుండి విచారణ పూర్తయి కోర్టులో చార్జిషీట్ సమర్పించే వరకు బాధితులకు అన్ని రకాల సపోర్ట్ ఈ భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందన్నారు.

మోసపోయిన బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి మనోధైర్యాన్ని పెంచి మళ్లీ వంచనకు గురికాకుండా చూడటం,  తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఫోక్సో మరియు క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్ కు సంబంధించిన కేసులలో బాధితులకు సత్వర న్యాయం చేయుట కొరకు భరోస సెంటర్ కి బదిలీ చేయడం ద్వారా మెడికల్ ఎగ్జామినేషన్, బాధితురాలి వాంగ్మూలం నమోదు, బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సిలింగ్ ఇప్పించడం, బాధితురాలి స్టేట్మెంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేయడం, బాధితురాలికి పునరావాసం ఇవ్వటం వంటి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

భాదితులు నిర్భయంగా, నిచ్చింతగా ఉండవచ్చును. భరోసా ద్వారా  బాధిత అమ్మాయి/మహిళల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారికి అవసరమయ్యే శాఖలైన సి.డబ్ల్యు.సి/చైల్డ్ వెల్ఫేర్, మానసిక సమస్యలు ఉన్నట్లయితే నిపుణుల వద్దకు పంపడం జరుగుతుందని తెలిపారు. బాధితురాలు సఖి కేంద్రంలో ఉండే విధంగా ఏర్పాటు, యుక్త వయసులో ఉన్న బాలికలు, అబ్బాయిలతో పాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ భరోసా సెంటర్లో సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ పర్సన్, ఏఎన్ఎంతో పాటు రిసెప్షనిస్టు సేవలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఆశా కార్యకర్తల మహాధర్నాకు ముందస్తు అరెస్టులు

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ మౌన దీక్షలు

Satyam NEWS

రష్యాకు అనుకూలంగా వచ్చిన ప్రజాభిప్రాయ ఫలితం

Satyam NEWS

Leave a Comment