27.7 C
Hyderabad
May 4, 2024 08: 59 AM
Slider హైదరాబాద్

సకాలంలో సీఎంఆర్ పూర్తి చేసే మిల్లర్లపై ఒత్తిడి తగ్గించే చర్యలు

#gangula

ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోమని, ఒక్క రూపాయిని పోనివ్వమన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అక్రమాలు చేస్తున్న, డిఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉన్న సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పటిష్టమైన టాస్క్ ఫోర్స్ ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్ పోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతో పాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సేకరణ పెరిగిందని,  ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అధనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇది అదనుగా కొన్ని చొట్ల మిల్లర్లు అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం ఇచ్చిన దాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనీ మా దృష్టికి వచ్చిందన్న మంత్రి, వారిపై క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం క్యాష్ రికవరీను సైతం వసూలు చేస్తున్నామన్నారు.

డిఫాల్ట్ మిల్లర్లు, అక్రమార్కులను ఉపేక్షించేది లేదని ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేసారు మంత్రి గంగుల. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుండి 90 శాతం రికవరీ చేసామని, మిగతా పది శాతం సైతం శరవేగంగా రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి పౌరసరఫరాల యంత్రాంగంతో పాటు కలెక్టర్లు ప్రత్యేకంగా ద్రుష్టి సారించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రికవరీలో వేగం సాధిస్తున్నారన్నారు.

మొన్ననే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చేసిన బియ్యం అక్రమాలను సైతం మా విజిలెన్స్ బ్రుందాలే పసిగట్టాయని, ఇందులో బాద్యులైన ప్రతీ ఒక్కరిపై క్రిమినల్ కేసులు బుక్ చేసామన్నారు, వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అక్రమాలను అరికట్టడానికి రాష్ట్ర స్థాయి విజిలెన్స్ బృందాలు స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాయన్నారు.

ఈ యాసంగి సీజన్లోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా, మిల్లర్లపై ఒత్తిడి కలుగకుండా ఇంటర్మీడియట్ గోదాములను సైతం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు, వీటితో పాటు మన సరిహద్దు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గత డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఒక్క గింజను కూడా కేటాయించబొమన్న మంత్రి, సక్రమంగా సకాలంలో మిల్లింగ్ చేస్తున్న వాటికి మద్దతిస్తూనే ఇంతవరకూ సీఎంఆర్లో పాల్గోనని మిల్లర్లను సైతం ప్రోత్సహించి వారికి ధాన్యం కేటాయింపులు చేసి సకాలంలో మిల్లింగ్ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ సకాలంలో సీఎంఆర్ పూర్తి చేయడం, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా కరికాలవలవన్ ప్రమాణస్వీకారం

Satyam NEWS

నిర్మల్ సీఐగా శ్రీనివాస్ రూరల్ కు వెంకటేష్‌

Satyam NEWS

సుద్దాల వాగు పై వంతెన కోసం మంత్రి కి వినతి పత్రం

Satyam NEWS

Leave a Comment