27.7 C
Hyderabad
May 4, 2024 07: 41 AM
Slider కడప

ఏపీ రాజకీయ ముఖచిత్రం మార్చే సినిమా ఆర్జీవీకి లేదు

సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకంటే ముందు కడపకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా నగరంలోని ఆర్ అండ్ బీ అతిధి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. సొంత జిల్లాను కూడా విస్మరించారన్నారు.

వరదలు వచ్చి దాదాపుగా ఏడాది అవుతున్నా అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదన్నారు. దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందని ఆరోపించారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ తెగిపోయిందని విమర్శించారు. సీఎం జగన్… జిల్లాకే న్యాయం చేయకపోతే రాష్ట్రానికి ఏమి చేస్తారో అర్థం కావట్లేదన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్య లు పరిష్కరించాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు పాపం రాష్ట్ర ప్రభుత్వానిదే అని మండిపడ్డారు.

కడపలో ఎదురుదెబ్బ తప్పదు

“రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో కాదు కడపలో కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదు. సీఎం జగన్ కు సూటిగా మూడు ప్రశ్నలు సంధిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం పక్క దారి పట్టిస్తున్న సీఎం జగన్.. దాదాపు 66 కార్పొరేషన్ లు జగన్ పెట్టారు. బీసీల పక్షపాతి అన్న జగన్ కార్పొరేషన్ లకు నిధులు కేటాయించలేదు. కార్పొరేషన్ చైర్మన్ లు, డైరెక్టర్లు దమ్ముంటే ప్రజల ముందుకు రావాలి. కార్పొరేషన్ ద్వారా ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి. విజిటింగ్ కార్డుల పోస్టుల కోసం నాయకులు కులాలకు ద్రోహం చేస్తున్నారు.

బీజేపీ, జనసేన విడిపోవాలని కొంత మంది కోరుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సహకారం లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడదు. 175 సీట్లు గెలుస్తామని సీఎం జగన్ చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవదని అందరికీ తెలుసు. కానీ సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు.”- విష్ణువర్ధన్ రెడ్డి

ఆ సామర్థ్యం ఎవరికీ లేదు

బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ జనసేనను విడదీసేంత సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో తెలంగాణలో కేసీఆర్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలను రానున్న కాలంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఏపీలో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయని ఎద్దేవా చేశారు. పంచాయితీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని విమర్శించారు.

ఏపీలో బీజేపీ, జనసేన అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాంగోపాల్ వర్మ ప్రచారం కోసం పరితపించే వ్యక్తి అని విమర్శించారు. సీఎం జగన్ తో 45 నిమిషాలు సమావేశమైన రాంగోపాల్ వర్మ….కుట్ర అనే సినిమా తీస్తున్నారని విమర్శించారు. రాం గోపాల్ వర్మ సినిమాలు చూసే స్థితిలో ప్రజలు లేరన్నారు. వైసీపీ నేతలు, రాంగోపాల్ వర్మ కూర్చొని మాట్లాడుకున్న కుట్రపై సినిమా తీయాలన్నారు. రాంగోపాల్ వర్మ లాంటి పిచ్చోడి చేతికి రాయి ఇస్తే అది తిరిగి వైసీపీ మీదే పడుతోందన్నారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే సినిమా రాంగోపాల్ వర్మకు లేదన్నారు. ఆర్జీవీ సినిమా చూసే స్థాయి నుంచి హాలీవుడ్ రేంజ్ కు ప్రేక్షకులు వెళ్లిపోయారన్నారు.

Related posts

తొమ్మిది మంది అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్

Murali Krishna

చిరంజీవికి రాజ్యసభ సీటు వార్తల్లో నిజం లేదు

Satyam NEWS

కాటికి పోదామంటే దారి కరవాయే

Satyam NEWS

Leave a Comment