26.7 C
Hyderabad
May 3, 2024 10: 23 AM
Slider నల్గొండ

తొమ్మిది మంది అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్

#nalgonda

తొమ్మిది మంది అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు  అదుపులోకి తీసుకొని 10 లక్షల నగదు 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి శివారులో గల కనకదుర్గ హోటల్ మరియు ధాభా వద్ద కొందరు వ్యక్తులు అనుమానస్పదముగా ఉన్నారనే సమాచారంతో  నార్కెట్ పల్లి సి ఐ, ఎస్ ఐ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి, అక్కడ అనుమానస్పదముగా ఉన్న తొమ్మిది మందిని పట్టుకుని, విచారించగా వీరంతా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారిగా కనుగొన్నారు.  ఇందులో  తాజ్, సర్ఫరాజ్ అను వారు గత 15 సంవత్సరముల నుండి వారి రాష్ట్రంతో పాటు  బెంగలూర్ లో, చెన్నై , తిరుపతి, విజయవాడ, వైజాక్, గుంటూర్ లలో బస్ స్టాండ్ లలో బస్ లలో ప్రయాణించే ప్రయాణీకుల బ్యాగ్ ల నుండి డబ్బులు, బంగారం దొంగతనము చేస్తున్నారు. గతంలో తాజ్, సర్ఫరాజ్ లు కలిసి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండ, నార్కెట్ పల్లి, కోదాడ, షాద్ నగర్, హైదరాబాద్ మహంకాళి, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిదిలలో కూడా దొంగతనాలు చేసినారు, ఇద్దరు 9 నెలలు జైల్ శిక్ష కూడా అనుభవించినారు.

తదుపరి వీరు మరలా దొంగతనాలు చేయాలని, నలుగురు కలిసి వారికి తెలిసిన స్నేహితులు మరియు బంధువులు లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ ఏడాది సెప్టెంబర్ 7 వ తేదీన  పై వ్యక్తులు నార్కెట్ పల్లి గ్రామ శివారులో గల పూజిత హోటల్ వద్ద బస్సు టిఫిన్ కోసం ఒక బస్సు ను ఆపగా అందులోనుండి కొంత మంది ప్రయాణికులు టిఫిన్ కోసం దిగినారు, ఇది అదునుగా భావించి అందులో కొంత మంది చుట్టూ పక్కల పరిసరాలను చూస్తుండగా కొంత మంది వ్యక్తులు అట్టి బస్ లోనికి ఎక్కి బస్ లగేజి స్టాండ్ లో వెతికి ఒక బ్యాగ్ ను తడిమి చూడగా అందులో 30 లక్షల రూపాయలు ఉన్నవి అని గమనించి అట్టి బాగ్ నుండి మొత్తం డబ్బులను దొంగిలించినారు.

సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి  తొమ్మిది మంది అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకొని 10 లక్షల నగదు 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై  రాచకొండ కమీషనరేట్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద  జీరో ఎఫ్ఐఆర్ చేసి చిట్యాల పోలీస్ స్టేషన్ కు ట్రాన్సఫర్ చేయగా వెంటనే అట్టి ఎఫ్ఐఆర్ ను బట్టి చిట్యాల పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 175/2022 సెక్షన్ 379 ఐపిసి లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు ccs స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి నెరస్థుల యొక్క కదలికలను గమనిస్తూ వీరు అంతర్ రాష్ట్ర ముఠా గా నిర్ధారించి వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగినదని ఎస్‌పి రేమ రాజేశ్వరి తెలిపారు.

Related posts

శాంతియుత హైదరాబాద్ కోసం టీఆర్ఎస్ కే ఓటు

Satyam NEWS

ఫ్రమ్ బ్రిడ్జి:భరత్‌నగర్‌ బ్రిడ్జిపై కారు బోల్తా ఒకరు మృతి

Satyam NEWS

సమస్యల పరిష్కారానికి పావని మణిపాల్ రెడ్డి కృషి

Satyam NEWS

Leave a Comment