27.7 C
Hyderabad
May 15, 2024 03: 42 AM
Slider మహబూబ్ నగర్

వలస కూలీలకు, అనాథలకు, నిస్సహయులకు చేయూత

singotam youth

కరోనా వైరస్  కారణంగా ఇబ్బందులు పడుతున్న దినసరి కూలీలకు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో నెహ్రూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువకులు ఒకొక్కరికి 10kg ల చొప్పున 30 కుటుంబాలకు  బియ్యాన్ని, కూరగాయలను అందించారు.

ఈ బియ్యం, కూరగాయలను ఆ యువకులు గడప గడప కు తిరిగి సేకరించారు. మొత్తం వారు సేకరించిన 356 kg ల బియ్యం పేదలకు పంచిపెట్టారు. ప్రతి రోజు ఆహారాన్ని సంపాదించి పూట గడుపుకునే  వలస వాదులకు, ప్రస్తుతం కరోనా భయం తో ఎవరి ఇంటి ముందుకు వెళ్లిన అన్నం కానీ, కూరలు వేయని అనాధ లకు ప్రస్తుత తరుణం లో ఇది ఎంతో సాయమని పలువురు అంటున్నారు.

పూట గడవడం ఎలాగో అని దిగులు చెందుతూ దిన దిన  గండం గా గడిపే ఎలాంటి ఆధారం లేని అనాథలకు 56kg ల బియ్యాన్ని, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  స్వచ్చంద సేవ సంస్థ,  నెహ్రూజీ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam NEWS

ప్రజావాణి ఫిర్యాదులపై శ్రద్ధ వహించాలి

Satyam NEWS

రాష్ట్ర స్థాయిలో విజేతలైన నిర్మల్ జిల్లా దివ్యాంగులకు సన్మానం

Satyam NEWS

Leave a Comment