38.2 C
Hyderabad
May 3, 2024 21: 45 PM
Slider హైదరాబాద్

కరోనా ఎఫెక్ట్: ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు

LBNagar

లాక్ డౌన్ దృష్ట్యా ఏ ఒక్కరు తిండి లేక ఇబ్బందులు పడవద్దు అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి సూచనల మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 1500 రూపాయలు, అలాగే కార్డు నందు పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కేజీల బియ్యం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ రోజు చైతన్యపురి డివిజన్ యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి డివిజన్ పరిధిలోని వివిధ చౌక ధరల దుకాణం వద్ద ఉచిత బియ్యం పంపిణీ చేశారు. కుటుంబానికి ఉచిత బియ్యంతో పాటు నిత్యావసరాల కోసం కార్డు పై 1500 రూపాయలు బ్యాంక్ నందు జమ చేస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా వారు ప్రతి రేషన్ షాప్ వారికి 25 శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఏ ఒక్కరు పస్తులు ఉండకుండా, వారిని కడుపులో పెట్టుకోని చూసుకుంటామనిమని తెలిపారు. అలాగే వలస కార్మికులను తమ బిడ్డలుగా భావించి ఒక్కొక్కరికి 500 రూపాయలు, 12 కేజీల బియ్యం లేదా గోధుమలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు.

అలాగే కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సామజిక దూరం పాటించాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపారు. అలాగే బియ్యం సరఫరా చేసేటప్పుడు రేషన్ షాపు డీలర్లు ప్రజలు వేలిముద్ర ఇచ్చేటప్పుడు సానిటైజర్స్ ని ఉపయోగించాలని తెలిపారు.

ప్రభుత్వం అందించిన అవకాశాలు,సదుపాయాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

Related posts

రుణమాఫీ ఇంకెన్నాళ్లు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ

Satyam NEWS

కోటపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి

Bhavani

ప్ర‌ణాళిక,పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి

Satyam NEWS

Leave a Comment