33.2 C
Hyderabad
May 4, 2024 02: 14 AM
Slider ఖమ్మం

రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి

#Vishnu Warrier IPS

రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన  నేరసమీక్ష సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..రాష్ట్ర, జాతీయ రహదారులపై  అతివేగం, అవగాహన రాహిత్యంతో జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతుందని తెలిపారు. మానవ తప్పిదానికి తోడు ప్రమాదాలు జరగడానికి ఇతర కారణాలను కనిపెట్టి వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేపట్టాలని సూచించారు.

సురక్షితమైన సమాజం, నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాడమే ఖమ్మం పోలీస్ కమీషరేట్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై నేనుసైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

నమోదు అయిన ప్రతి కేసులో నాణ్యతతో కూడిన దర్యాప్తు చేయడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని తద్వారా నిందుతులకు శిక్ష పడి బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

అత్యవసర సమయంలో ప్రజలు వినియోగించే డయల్100 కాల్స్ రెస్పాన్స్ పై ప్రజలలో మంచి స్పందన వుందని, మరింత వేగంగా స్పందించి సేవలందించాలని సూచించారు.

పెండింగ్ లో వున్న  కేసులు,  కేసుల డిస్పోజల్స్, కన్వెక్షన్ కు సంబంధించిన ఆంశలపై అధికారులతో చర్చించారు.

పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొవాలని సూచించారు.

Related posts

విజయనగరం మేయర్ గా ఆశపు సుజాత..?

Satyam NEWS

మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా

Satyam NEWS

పొనుగోడులో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జెండాపండుగ

Satyam NEWS

Leave a Comment