32.2 C
Hyderabad
May 13, 2024 20: 35 PM
Slider ప్రత్యేకం

టి ఎస్ ఆర్ టి సి ప్రయాణికులను పరోక్షంగా దోచుకుంటుందా ?

#tsrtc

టి ఎస్ ఆర్ టి సి ప్రయాణికులను పరోక్షంగా ,ప్రత్యక్షంగా దోచుకుంటుందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. పేదా, మధ్యతరగతి వారు ఎక్కడికన్నా ప్రయాణించాలంటే టిఎస్ఆర్టిసి బస్సు మార్గమే చౌక అని ప్రయాణానికి వీలు ఉంటుందని సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవచ్చనే సదుద్దేశంతో ప్రయాణానికి టి ఎస్ ఆర్ టి సి  బస్సును ఎంచుకుంటారు.

అటువంటిది చిల్లర కోసమని కొంత, డీజిల్ రేట్లు పెరిగానీ కొంత పరోక్షంగా పెంచుకుంటూ పోవడం కాక స్టాపులు లేని చోట బస్సులు ఆపి ప్రయాణికులను ఎక్కించుకొని వారి  గమ్యస్థానాలకుచేర్చే ప్రక్రియ లో కండక్టర్లు, డిపో మేనేజర్లు గోల్మాల్ చేస్తున్నారని, బస్సు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఈ స్టేజి దగ్గర స్టాప్ లేదని టికెట్ కొట్టే సమయంలో బస్సు మొదలైన స్టాపు నుండి టికెట్ కొట్టి అప్పుడు చెల్లించాల్సిన టికెట్ రుసుము గురించి చెప్తున్నారని ,జేబులో డబ్బులు లేక కొందరు ఇబ్బందులు పడుతుంటే మరికొందరు30 శాతం పైగా అధిక మొత్తంలో  కుచ్చుటోపి పడుతుందని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

కండక్టర్లు ప్రయాణికులతో వాగ్వాదానికి దిగి మార్గమధ్యలోనే బస్సు దిగమని దూషిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇట్టి సందర్భాలలో మహిళలు ఉంటే రాత్రిపూట జరిగే అనర్థాలకు ఇబ్బందులకు ఆర్టీసీ కారణమవుతుందని ప్రయాణికులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాదు నుండి అచ్చంపేట డిపో కు చెందిన బస్సును బుధవారం దాదాపు రాత్రి 8 గంటల 40,8 గంటల50 నిమిషాల సమయాన బీభత్సమైన వర్షంలో తుక్కుగూడ గ్రామ బస్సు స్టాపు ఆవరణలో బస్సును నిలపడంతో  ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కి కండక్టర్ ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా కల్వకుర్తి అని చెప్పగా వెనుక సీటు ఉందని కూర్చోమని చెప్పారు.

బస్సు కొంచెం దూరం వెళ్ళాక టికెట్ కొట్టే సమయంలో 130 రూపాయలు ఇవ్వమని కోరారు. ప్రయాణికుడు వంద రూపాయలే కదా అని ప్రశ్నించగా కాదనిఇక్కడ స్టాప్ లేదని హైదరాబాదు నుండి టికెట్ రుసుము చెల్లించాల్సిందేనని పట్టుబట్టారని, లేనిచో మార్గమధ్యలోనే దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేయటంతో స్టాపు లేనిది ఎందుకు బస్సును ఆపారని, డే పాస్ తీసుకొని తుక్కుగూడ వరకు ఉచితంగా వచ్చిన ప్రయాణికుడు 130 రూపాయలు టికెట్ కొనుక్కొని లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇట్టి విషయంపై అచ్చంపేట డిపో మేనేజర్ ను చరవాణిలో వివరణ కోరగా బస్సు స్టాపులు లేకున్నను చేయెత్తి ఆపితే ఆపుతామని కాకపోతే ముందు స్టేజి నుండే టికెట్ కొనాల్సి ఉంటుందని వివరణ ఇచ్చారు. తుక్కుగూడలో స్టాపు లేదని తెలిపారు. భారీ వర్షం లో ప్రయాణికుడు  తడుచుకుంటూ బస్సును చేతి ఎత్తి ఎలా ఆపుతారని అది కూడా కొంత దూరం ప్రయాణించిన తర్వాత టికెట్ ధర కండక్టర్ తెలిపారని ఇట్టి విషయంపైవివరణ కోరగా కండక్టర్ దే తప్పని అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హైదరాబాదు నుండి అచ్చంపేట వరకు ఎక్కడెక్కడ స్టాపులు ఉన్నాయో తెలపాలని కోరగా అసిస్టెంట్ డిపో మేనేజర్ సంప్రదించాలని కోరారు. ఆయన హాజీపూర్ చెన్నారం డిండి కిష్టం పల్లి వంగూర్ కల్వకుర్తి వెల్దండ ఆమనగల్ మైస్ గండి కడ్తాల్ కందుకూర్, హైదరాబాద్ అని తెలిపారు.డిపో మేనేజర్ వివరణలో తుక్కుగూడలో స్టాపు లేదని కచ్చితంగా చెప్పిన ఆయన ఎన్ని స్టాపులు ఉన్నాయో వివరణ ఇవ్వడంలో  జాప్యం చేస్తూ అసిస్టెంట్ మేనేజర్ ను సంప్రదించాలని సూచించడంతో కావాలనే కండక్టర్లు డిపో మేనేజర్ కలిసే ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారా అనే పలు అనుమానాలకు దారితీస్తుందనే చెప్పాలి.

ప్రయాణికుడు తనకు జరిగిన నష్టాన్ని ట్విట్టర్లో ఆర్టీసీ ఎండి  వి.సి. సజ్జనర్ కు ట్వీట్ చేసినట్లు ఆయన స్పందించి టి ఎస్ ఆర్ టి సి హెచ్ క్యూ వారికి ఫిర్యాదును బదిలీ చేసినట్లు ప్రయాణికుడు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీసీకి ఉన్న మంచి పేరును సురక్షిత ప్రయాణం, పేదా మధ్య తరగతి వర్గాలకు వివిధ గమ్యస్థానాలకు చేర్చే ఆపన్న హస్తముగా పేరుపొందిన ఆర్టీసీని కొందరు అధికారుల వలన చెడ్డ పేరు మూట కట్టిస్తున్న వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Related posts

ఏపిలో రాజకీయ పునరేకీకరణకు ఇది లాంగ్ మార్చ్

Satyam NEWS

లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలి

Bhavani

ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 19 మంది మృతి

Satyam NEWS

Leave a Comment