28.7 C
Hyderabad
May 6, 2024 02: 15 AM
Slider ప్రపంచం

రష్యా సైన్యంలో చేరాలని యూనివర్సిటీ విద్యార్థులపై వత్తిడి

#russia

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ను పూర్తిగా నాశనం చేస్తానని రష్యా శపథం చేసింది. దీనికోసం మరింత మందిని సైన్యంలోకి దించుతున్నది. ఈ యుద్ధంలో పాల్గొనకపోతే వారి ట్యూషన్ ఫీజులు పెంచుతామని రష్యా ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫ్రికన్ విద్యార్థులను ఒత్తిడి చేస్తోందని వార్తలు వస్తున్నాయి. వార్తా వెబ్‌సైట్ ది డైలీ బీస్ట్ నవంబర్ 21న చేసిన పోస్టు ప్రకారం గత మూడు నెలలుగా రష్యాలోని దక్షిణ విశ్వవిద్యాలయాల అధికారులు తమ సైన్యంలో చేరడానికి రష్యన్ సైన్యం ఆఫర్‌ ఇచ్చింది.

ఈ అవకాశం అంగీకరించేలా విద్యార్థులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆ వార్తలో వివరించారు. రోస్టోవ్-ఆన్-డాన్‌లోని రష్యా యూనివర్శిటీ ఆఫ్ సౌత్‌కు చెందిన ఆఫ్రికా విద్యార్థులను ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రష్యా వాగ్నెర్ గ్రూప్ కిరాయి సైనికులలో చేరాలని కోరినట్లు ది డైలీ బీస్ట్ నివేదించింది. ఉక్రెయిన్‌లో పోరాడటానికి ఇష్టపడే వారికి $3,000 నుండి $5,000 వరకు జీతాలు ఇస్తామని కూడా చెబుతున్నారు.

ఈ ఆఫర్‌లను తిరస్కరించిన వారికి స్కాలర్‌షిప్‌లను రద్దు చేస్తామని, వారి ట్యూషన్ ఖర్చులు పెరుగుతాయని కూడా బెదిరిస్తున్నారు. రష్యాలోని కొంతమంది నైజీరియన్ విద్యార్థులు డైలీ బీస్ట్‌తో మాట్లాడుతూ, తమ వసతి గృహంకు ప్రతి రోజూ కొందరు సైనికాధికారులు వస్తున్నారని ఉక్రెయిన్ పై పోరాడటానికి మమ్మల్ని ఒప్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొందరు ఇప్పటికే రష్యన్ సైన్యంలో చేరి పోరాడుతున్నారు.

Related posts

భూతద్ధం భాస్కర్‌ నారాయణగా శివ కందుకూరి నటించిన సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌

Satyam NEWS

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కోల కు ఆత్మీయుల సన్మానం

Satyam NEWS

స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి

Satyam NEWS

Leave a Comment