40.2 C
Hyderabad
May 6, 2024 17: 20 PM
Slider వరంగల్

రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొమ్మూరి

#kommuripratapreddy

రాహుల్ గాంధీ వరంగల్ సభలో జరిగిన రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వయంభూ కొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామిని మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దర్శించుకున్నారు.

అనంతరం సిద్ధేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొడవటూరు నుండీ కేసిరెడ్డి పల్లి మీదుగా బండనాగరం,కట్కూరు, ఆలింపుర్, బచ్చన్నపేట గ్రామాలలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి రైతు డిక్లరేషన్ లోని రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర రుణమాఫీ వంటి కార్యక్రమాలను అమలుచేస్తామని ప్రజలకు వివరించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. కేసిరెడ్డి పల్లిలోని ఐకేపి సెంటర్ ను సందర్శించి రైతులను ధాన్యం సేకరణపై అడిగి తెలుసుకున్నారు.ఐకేపి ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించిన తరువాత మిల్లర్లు ధ్యాన్యంలో కోతలు పెడుతున్నారని రైతులు ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున రైతుల పక్షాన పోరాడతామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాలకిషన్ గౌడ్,సిద్ధారెడ్డి, మాజీ ఎంపీపీ పరుశరాములు  కిష్టయ్య,జంగిటి విధ్యనాథ్, మల్లేశం, మోహన రెడ్డి,కొమ్మూరి యువసేన అధ్యక్షులు దాసరి క్రాంతి, అర్షద్, బాలమణి, రమేష్, బక్క రాజయ్య, యాదగిరి, శ్రీను, యండి, యూసుఫ్, వెంకటేశ్వర్, సిద్ధులు, వెంకట్ రెడ్డి, మహేందర్, ఎల్లారెడ్డి, బుచ్చిరాజు, మల్లారెడ్డి, పరిదే శ్రీనివాస్, నాగరాజు, వేణు, ఆముదాల మల్లారెడ్డి, మధుసూదన్ రెడ్డి, హరి, శీను, గాలి కృష్ణ, మల్లేశం, కరుణాకర్ రెడ్డి బండనాగరం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్రిటన్ ప్రధాని పదవి పై బుకీల రికార్డు స్థాయి బెట్టింగులు

Satyam NEWS

బిజెపి సర్కారు విధానాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలి: సిఐటియు

Satyam NEWS

అపార్ట్ మెంట్‌లో అగ్ని ప్రమాదం.. చిక్కుకున్న జనాలు

Sub Editor

Leave a Comment