33.7 C
Hyderabad
April 28, 2024 23: 02 PM
Slider నల్గొండ

బిజెపి సర్కారు విధానాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలి: సిఐటియు

#citu

జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మార్చి 28,29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయటానికి,ప్రజల సంపదను రక్షించుకునేందుకు కార్మిక వర్గ ప్రజలు పోరాటాలకు సమైక్యం కావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పిలుపునిఇచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో అడ్డా మీద రోజువారీ కార్మికుల సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాలు దూకుడుగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పటం చూస్తుంటే తెలుస్తుందని విమర్శించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి పార్టీని ఓడించటానికి రైతు సంఘాలు,శ్రామిక వర్గం సిద్ధంగా ఉన్నాయని అన్నారు. బిజెపి సర్కార్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలని కాపాడండి,దేశాన్ని కాపాడండి, కార్మిక చట్టాలను కాపాడండి అనే నినాదంతో బ్యాంకు జాతీయకరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని మార్చి 28,29,తేదీలలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం,బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకి మద్దతు ఇవ్వాలని,ఇది మరో రైతు పోరాటం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎలక సోమయ్య గౌడు,పీహల్ రాజు,రామారావు,లక్ష్మణ్, వెంకటేశ్వర్లు,లక్ష్మి,సీత,సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉక్రెయిన్ లో జరుగుతున్న పాశవికదాడిపై భారత్ ఆందోళన

Satyam NEWS

మేం పాస్ లు ఇచ్చినా ఏపి అనుమతించడం లేదు

Satyam NEWS

వైసీపీని గద్దె దించేవరకూ పోరాడుతూనే ఉంటా

Satyam NEWS

Leave a Comment