38.2 C
Hyderabad
May 5, 2024 22: 18 PM
Slider ప్రత్యేకం

కుతుబ్ మినార్ యాజమాన్య హక్కుల వ్యాజ్యం కొట్టివేత

#qutubminar

ఢిల్లీలోని కుతుబ్ మినార్ యాజమాన్యంపై వేసిన వ్యాజ్యాన్ని ఢిల్లీ సాకేత్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. కున్వర్ మహేంద్ర దవేజా ప్రసాద్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సరైన అంశం లేదని కోర్టు అభిప్రాయపడింది. మీరట్, అలీఘర్, బులంద్‌షహర్ మరియు గుర్గావ్‌లోని యమునా, గంగా నదుల మధ్య ఉన్న ప్రాంతాలను కలిగి ఉన్న ఆగ్రా ఉమ్మడి రాజ్యం తో భారతదేశం స్వాంత్రంత్యం వచ్చిన తర్వాత ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే విలీనం చేసుకున్నదని, అందువల్ల ఇది చెల్లదని కున్వర్ మహేంద్ర దవేజా ప్రసాద్ సింగ్ వాదించారు.

అదే విధంగా కుతుబ్ మీనార్ పై కూడా హక్కులను కోరారు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ వచ్చిన అప్పీళ్లకు సంబంధించి మరో దరఖాస్తు దాఖలైంది. అదే సమయంలో, కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లోపల హిందువులు మరియు జైనులకు పూజించే హక్కును కోరుతూ దాఖలైన అప్పీల్‌పై అక్టోబర్ 19న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అంతకుముందు సెప్టెంబర్ 13న కోర్టు విచారణలో, దరఖాస్తుదారు మహేంద్ర సింగ్ ప్రత్యేకంగా అప్పీల్‌లో ఎటువంటి ప్రత్యేక హక్కును క్లెయిమ్ చేయనందున దరఖాస్తును కొట్టివేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వాదించింది.

విశాలమైన ప్రాంతాలపై సింగ్ హక్కులను క్లెయిమ్ చేసినట్లు ASI వాదించింది. ఎర్రకోటపై తన హక్కు అంటూ సుల్తానా బేగం దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిందని ASI గుర్తు చేసింది. ఆ పిటిషన్ లో సుల్తానా బేగం తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ II మునిమనవడి భార్యను అని పేర్కొంది. అలాంటి దరఖాస్తునే కొట్టేసినప్పుడు సింగ్ అస్పష్టమైన క్లయిమ్ ను కొనసాగించడానికి వీల్లేదని ASI వాదించింది. ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు సింగ్ పిటిషన్ ను కొట్టివేసింది.

Related posts

టిడిపి, జనసేన లు కలిసి పోటీ చేస్తే 20 పార్లమెంట్ స్థానాలు

Satyam NEWS

ఒమేగా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

నిరుపేదలను రేప్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోదా?

Satyam NEWS

Leave a Comment