పెద్దలకి ఒక న్యాయం, పెదవాడికి మరోక న్యాయమా అని ప్రశ్నించారు మాజీ ఎంపి హర్షకుమార్. ఎటువంటి సమాజంలో బతకుతున్నామ్ మనం? ప్రాణం ఎవరిదైనా ఒకటే కాదా అని ఆయన ప్రశ్నించారు. నిందితులు ఎవరైనా గానీ మన అడపడుచులకు న్యాయం జరగాలి అని అన్నారాయన.
ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా లో అత్యాచారానికి గురైన టేకు లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించారు. కూలి పనుల నిమిత్తం పోయిన వారిని ఇలా దారుణంగా హింసించటం, లైంగికంగా దాడి చేసి చంపంట అనేది చాలా దారుణం, ఈ ఘటన తెలంగాణ ప్రాంతంలోనే జరిగింది ప్రియాంక విషయంలో ఎంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారో నిరుపేదరాలైన టేకు లక్ష్మీ కేసులో కూడా అలానే చేయాలని హర్షకుమార్ కోరారు.
ఈ బాధితురాలి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని, ముందు ముందు ఇలాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరించాలని హర్షకుమార్ అన్నారు.