36.2 C
Hyderabad
May 14, 2024 16: 39 PM
Slider నిజామాబాద్

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తేవాలి

journos

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా లేబర్ అధికారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తరుపున వినతిపత్రం సమర్పించారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వినతిపత్రంలో కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధులుగా పని చేస్తున్నారన్నారు.

వర్కింగ్ జర్నలిస్ట్ లకు అండగా నిలిచే చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. జర్నలిస్టుల హక్కులను రక్షించాలని కోరారు. ప్రతి జర్నలిస్టుకు జస్టిస్ మతి జియా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను రద్దు చేయవద్దని కోరారు.

44 కార్మిక చట్టాలను నాలుగు గోడలుగా విభజించ వద్దన్నారు. జస్టిస్ మతి జియా కమిషన్ సిఫార్సులను అమలు చేసి వేజ్ బోర్డును అమలు చేయాలన్నారు. జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రతినిధులు జిల్లా అధ్యక్షుడు వేణు, జిల్లా కార్యదర్శి శ్రీ కృష్ణ చారి, క్యాషియర్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ విజయానంద్, పందిరి యాదయ్య, శ్రీకాంత్ రెడ్డి , సాయిబాబా, నరేందర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

మాట ఇవ్వడం.. మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

Bhavani

25 నుంచి నోవోటెల్ హోటల్ లో హై లైఫ్ బ్రైడ్స్ లైఫ్ స్టైల్ ఎక్సిబిషన్

Satyam NEWS

Leave a Comment