Slider కడప

క్రీడలు ప్రోత్సహించే విధంగా సారధి చిత్రం

నందమూరి తారకరత్న నటించిన సారధి సినిమా స్పెషల్ షో అన్నమయ్య జిల్లా రాయిచోటిలోని గౌతమ్ థియేటర్లో ప్రదర్శించారు. విద్యార్థిని,విద్యార్థులతో కలిసి(కోకో) క్రీడలను ప్రోత్సహించే చిత్రాన్ని మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు,తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు వీక్షించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీసుగవాసి ప్రసాద్ బాబుకి యూత్ ఐకాన్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ పంచభూత క్రియేషన్స్ నందమూరి తారకరత్న హీరోగా నటించిన సారధి సినిమా బాగుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కోకో క్రీడలను ప్రోత్సహించి నేటి విద్యార్థులకు తెలియజేసే విధంగా సినిమా చాలా విజయవంతంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాతలకు మంచి పేరు ఆదాయం తెచ్చి పెట్టే విధంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.సారధి సినిమాని రాయచోటిలోని గౌతమ్ థియేటర్లో తిలకించడం పట్ల విద్యార్థిని,విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

కొల్లాపూర్ లో యాసంగి పంట వెరిఫికేషన్ ప్రారంభం

Satyam NEWS

ప్రజా సంక్షేమమే పరమావధిగా కోతి సంపత్ రెడ్డి సేవ

Satyam NEWS

బాబును అడ్డుకోవడంపై డీజీపీకి హైకోర్టు నోటీసు

Satyam NEWS

Leave a Comment