32.2 C
Hyderabad
May 12, 2024 22: 48 PM
Slider సినిమా

రాజమండ్రి కుర్రాడు “సత్య రాచకొండ”కు బలమెవ్వడు?

#keeravani

తొలి చిత్రం “బలమెవ్వడు”తో దర్శకుడిగా తన బలాన్ని చాలా ఘనంగా ప్రకటించుకున్నాడు యువ ప్రతిభాశాలి సత్య రాచకొండ. “విమెన్ అహం” అనే లఘు చిత్రాలతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ “రాజమండ్రి కుర్రాడు” తెరకెక్కించిన “బలమెవ్వడు” చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోంది.

క్రౌడ్ ఫండింగ్ విధానంలో ధ్రువన్ – నియా త్రిపాఠి జంటగా… సుహాసిని, నాజర్, వృద్ధి (పెళ్లి ఫేమ్) వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం మణిశర్మ సంగీతం సమకూర్చడం ఒక విశేషమైతే… సంగీత బాహుబలి కీరవాణి టైటిల్ సాంగ్ ఆలపించడం మరో విశేషం. మైక్రో బయాలజీలో ఎమ్మెస్సీ చేసి ఓ ఎమ్.ఎన్.సిలో జాబ్ చేస్తూ దర్శకుడు కావాలన్న తన కలను సాకారం చేసుకోవడం కోసం ఆహరహం కృషి చేశాడు సత్య రాచకొండ.

“బలమెవ్వడు” చిత్రం షూటింగ్ మొదలు కాగానే కరోనా కాలం కమ్ముకొచ్చి… సినిమా నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చిన ఒకరిద్దరు వెనకడుగు వేసినా… తాను మాత్రం మొక్కవోని దీక్షతో “తగ్గేదేలే” అంటూ ముందుకు సాగాడు సత్య రాచకొండ. నిజ జీవిత సంఘటనకు కాస్తంత కల్పనను… తగినంత క్రియేటివిటీని జోడించి తాను రూపొందించిన “బలమెవ్వడు” చిత్రానికి ఈ స్థాయి ఆదరణ లభిస్తుందని ఊహించలేదని అంటాడు ఈ రాచకొండ వారబ్బాయి.

ఈ చిత్రం నిర్మాణంలో తనకు ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పే సత్య… విశ్రాంత ఉపాధ్యాయుడైన తన తండ్రి (రాచకొండ మార్కండేయులు) తన కలను నిజం చేయడం కోసం పడిన తపన చేసిన సాయం గురించి చెబుతూ ఒకింత ఉద్వేగానికి లోనవుతాడు. అలాగే తన జీవిత భాగస్వామి కూడా తనకు ఎంతో మోరల్ సపోర్ట్ చేసిందని చెబుతాడు.

తన మిత్రుడు కమ్ ఈ చిత్ర కథానాయకుడు ధ్రువన్, నిర్మాతల్లో ఒకరైన రాహుల్, గీత రచయిత కళ్యాణ్ కృష్ణ అండదండల వల్లే “బలమెవ్వడు” చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చడం… కీరవాణి టైటిల్ సాంగ్ పాడడం సాధ్యమైందని గర్వంగా వివరిస్తాడు సత్య.

“బలమెవ్వడు” చిత్రం ఒక కొత్త దర్శకుడు తేశాడంటే నమ్మడం కష్టం” అనే ప్రశంస ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మర్చిపోయేలా చేసిందని చెబుతున్న సత్య రాచకొండ… ఈ చిత్రానికి వివిధ వివిధ విభాగాల్లో అవార్డులు ఆశిస్తున్నామని ఆత్మవిశ్వాసంతో చెబుతాడు. ఈ చిత్రాన్ని విడుదల చేయడంలో తమకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ కి కృతజ్ఞతలు తెలిపిన సత్య రాచకొండ… తన తదుపరి చిత్రాన్ని “హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం”గా మలిచి… దర్శకుడిగా తన బలం మరింత బలంగా చాటుకునేందుకు తన కలానికి పదును పెడుతున్నాడు!!

Related posts

మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించడమే ప్రాధాన్యం

Satyam NEWS

మహిళల అక్షర జ్యోతి సావిత్రిబాయి పూలే

Satyam NEWS

మనోభావాలు వైసీపీకేనా వేరే పార్టీలకు ఉండవా?

Satyam NEWS

Leave a Comment